మెల్బోర్న్: ప్రపంచ కప్ 2015లో భారత జట్టు అదరగొడుతోంది. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా తమ సత్తా చాటుతున్నారు. ప్రపంచ కప్‌కు ముందు భారత బౌలర్ల పైన కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఈ ప్రపంచ కప్‌లో కెప్టెన్ ధోనీ, భారత జట్టుతో పాటు మన బౌలర్లు కూడా రికార్డ్ సృష్టించారు.
భారత జట్టు ప్రపంచ కప్‌ల్లో వరుసగా 11 మ్యాచుల్లో గెలిచిన రికార్డ్ సృష్టించింది. ఈ ప్రపంచ కప్‌లో వరుసగా ఏడో విజయం సాధించింది. మరో విషయమేమంటే ఈ ఏడు మ్యాచులలోను మన బౌలర్లు ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేశారు. ఇది రికార్డ్.
ప్రపంచ కప్ లీగ్ దశలో అన్ని మ్యాచుల్లోను భారత్ ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేసింది. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ జట్టును కూడా ఆలౌట్ చేసింది. భారత్ ఈ ప్రపంచ కప్‌లో ఏడు మ్యాచుల్లో ఏడు వికెట్లు తీసి రికార్డులకెక్కింది. బంగ్లాదేశ్‌ను 45 ఓవర్లలో 193 పరుగులకే కట్టడి చేసింది.
ఈ ప్రపంచ కప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసింది మొహమ్మద్ షమీ (15). రవిచంద్రన్ అశ్విన్ (12), ఉమేష్ యాదవ్ (10), మోహిత్ శర్మ (10), రవీంద్ర జడెజా (7) వికెట్లు తీశారు. లీగ్‌లో పాకిస్తాన్‌తో ప్రారంభమైన భారత్ విజయపరంపర బంగ్లాదేశ్ వరకు కొనసాగింది. మొదటి మ్యాచ్ నుండి ప్రతి దాంట్లో బౌలర్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేశారు.

ఈ ప్రపంచ కప్‌లో ఏ జట్టును ఎంతకు కట్టడి చేశారు?
1. 47 ఓవర్లలో పాకిస్తాన్‌ను 224 పరుగులకు ఆలౌట్ చేశారు. భారత్ 76 పరుగుల తేడాతో గెలిచింది.
2. 40.2 ఓవర్లలో సౌతాఫ్రికాను 177 పరుగులకు ఆలౌట్ చేశారు. భారత్ 130 పరుగుల తేడాతో గెలిచింది.
3.31.3 ఓవర్లలో యూఏఈని 102 పరుగులకు ఆలౌట్ చేశారు. భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది.
4. 44.2 ఓవర్లలో వెస్టిండీస్‌ను 182 పరుగులకు ఆలౌట్ చేశారు. భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.
5. 49 ఓవర్లలో ఐర్లాండ్‌ను 259 పరుగులకు కట్టడి చేశారు. భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
6. 48.5 ఓవర్లలో జింబాబ్వేని 287 పరుగులకు ఆలౌట్ చేశారు. భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.
7. క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 193 పరుగులకు కట్టడి చేసింది. భారత్ 109 పరుగుల తేడాతో గెలిచింది.