కెన్యాను ఆటాడుకున్న కివీస్, న్యూజిలాండ్ ఘన విజయం

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెన్యా.. కివీస్ బౌలర్లకు చక్కని ప్రాక్టీస్ కల్పించింది. ఇన్నింగ్స్‌లో నమోదైన బౌండరీలు నాలుగే. రెండంకెల స్కోరు అందుకు ఆటగాళ్లు ముగ్గురే. కనీసం 20 బంతులైనా ఆడినవాళ్లు ఇద్దరే. ఆరంభం నుంచి కివీస్ బౌలర్లదే జోరు. కెన్యా బ్యాట్స్‌మెన్.. వారిని నిలువరించింది తొలి ఆరు ఓవర్లే. ఏడో ఓవర్లో ఒబాండ (6)ను ఎల్బీగా సౌథీ వెనక్కి పంపాడు. ఆ తర్వాత బెనెట్ హవా మొదలైంది. బెనెట్ 9 పరుగుల తేడాలో వాటర్స్ (16), టికోలో (2), ఒబుయా (14), ఔమా (1)లను పెవిలియన్ పంపి కెన్యా పతనాన్ని శాసించాడు. అతడికి సౌథీ, ఓరమ్ జతకలవడంతో కెన్యా కోలుకోలేకపోయింది. సౌథీ 23వ చివరి రెండు బంతులకు ఒదియాంబో, నోచెలను ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో ఓరమ్.. కెన్యా చివరి వికెట్ తీయడంతో సౌథీ హ్యాట్రిక్ అవకాశాన్ని కోల్పోయాడు. 41/1తో ఉన్న కెన్యా 19 పరుగులకే మిగతా 9 వికెట్లను కోల్పోయింది. అన్ని వికెట్లూ పేసర్లకే పడ్డాయి. చెన్నైలో అత్యల్ప స్కోరు కెన్యా (69)దే. ప్రపంచకప్‌లో ఇది ఐదో అత్యల్ప స్కోరు.
కనీసం టీ20 మ్యాచ్ చూశామన్న సంతృప్తి అయినా మిగల్లేదు ప్రేక్షకులకు. ఓ సినిమా పూర్తయ్యే సమయంలో మ్యాచ్ ముగిసింది. రెండు గంటల 24 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 31.5 ఓవర్ల (రెండు నోబాల్స్‌తో కలిపి 193 బంతులు) ఆట మాత్రమే జరిగింది. ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా ముగిసిన రెండో మ్యాచ్ ఇది. 2003లో కెనడా, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో 140 బంతుల ఆటే సాధ్యమైంది.కెన్యా మ్యాచ్‌లో రెండుసార్లు యూడీఆర్‌ఎస్‌ను వినియోగించుకుంది. రెండుసార్లూ విఫలమైంది.
స్కోరు వివరాలు
కెన్యా ఇన్నింగ్స్: ఒబాండ (ఎల్బీ) (బి) సౌథీ 6; వాటర్స్ (ఎల్బీ) (బి) బెనెట్ 16; ఒబుయా (ఎల్బీ) (బి) బెనెట్ 14; టికోలో (బి) బెనెట్ 2; ఔమా (ఎల్బీ) (బి) బెనెట్ 1; రాకెప్ పటేల్ నాటౌట్ 16; కమాండె (సి) బ్రెండన్ మెక్‌కలమ్ (బి) ఓరమ్ 2; ఒడొయో (సి) రైడర్ (బి) ఓరమ్ 2; ఒదియాంబో (బి) సౌథీ 0; నోచె (ఎల్బీ) (బి) సౌథీ 0; ఒటియానో (సి) స్త్టెరిస్ (బి) ఓరమ్ 0; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (23.5 ఓవర్లలో ఆలౌట్) 69; వికెట్ల పతనం: 1-14, 2-40, 3-42, 4-44, 5-49, 6-59, 7-63, 8-68, 9-68
బౌలింగ్: సౌథీ 6-0-13-3; నాథన్ మెక్‌కలమ్ 4-0-15-0; బెనెట్ 5-0-16-4; వెటోరి 6-1-16-0; ఓరమ్ 2.5-1-2-3
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్తిల్ నాటౌట్ 39; బ్రెండన్ మెక్‌కలమ్ నాటౌట్ 26; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 72
బౌలింగ్: ఒడొయో 3-0-25-0; ఒటియానో 2-0-18-0; కమాండె 2-0-21-0; ఒదియాంబో 1-0-5-0.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications