కెనడా కూనలపై సంహళీయుల పంజా, జయవర్థనే అద్భుత సెంచరీ

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు తరంగ (19), దిల్షాన్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. ఐతే కెనడా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఓపెనర్లను ధాటిగా ఆడనివ్వలేదు. దిల్షాన్ కాస్త వేగంగానే ఆడినా.. తరంగ ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. తరంగ జట్టు స్కోరు 63 (12వ ఓవర్లో) వద్ద వెనుదిరిగాడు. 20వ ఓవర్లో దిల్షాన్ ఔటయయ్యేటప్పటికి స్కోరు 88 పరుగులే. సంగక్కరకు జయవర్దనే తోడవడంతో స్కోరు వేగం పెరిగింది. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన జయవర్దనే.. కెనడా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. క్రమం తప్పకుండా సింగిల్స్ తీస్తూనే, బౌండరీలు బాదాడు. మరోవైపు తొలి బౌండరీకి 47 బంతులు ఆడిన సంగక్కర కూడా క్రమంగా జోరు పెంచాడు. అయితే అతడు సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో ఔటయ్యాడు. సంగక్కర నిష్క్రమణ తర్వాత ఓ సింగిల్‌తో జయవర్దనే శతకం (80 బంతుల్లో) పూర్తి చేశాడు. ప్రపంచకప్‌లో ఇది నాలుగో వేగవంతమైన సెంచరీ. ఐతే జయవర్దనే అదే స్కోరు వద్ద ఔటయ్యాడు. జయవర్దనే-సంగక్కర మూడో వికెట్‌కు 179 పరుగులు జోడించారు.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: తరంగ రనౌట్ 19; దిల్షాన్ (సి) డేవిసన్ (బి) రిజ్వాన్ చీమా 50; సంగక్కర (సి) అండ్ (బి) డేవిసన్ 92; జయవర్దనే (సి) బాలాజీ (బి) డేవిసన్ 100; పెరీరా రనౌట్ 11; మాథ్యూస్ (సి) అండ్ (బి) బైద్వాన్ 21; కపుగెదెర (సి) కుమార్ (బి) బైద్వాన్ 2; తిలాన్ సమరవీర నాటౌట్ 18; కులశేఖర నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 332
వికెట్ల పతనం: 1-63, 2-88, 3-267, 4-276, 5-284, 6-295, 7-314
బౌలింగ్: ఖుర్రమ్ చోహన్ 8-0-62-0; ఒసిండె 2.1-0-10-0; బైద్వాన్ 8.5-0-59-2; హన్స్‌రా 9-0-47-0; రిజ్వాన్ చీమా 7-0-47-1; బాలాజీ రావు 7-0-48-0; డేవిసన్ 8-0-56-2
కెనడా ఇన్నింగ్స్: గుణశేఖర (సి) దిల్షాన్ (బి) కులశేఖర 1; డేవిసన్ (బి) పెరీరా 0; సుర్కారి ఎల్బీ (బి) పెరీరా 6; హన్స్‌రా (స్టంప్డ్) సంగక్కర (బి) సమరవీర 9; ఆశిష్ బగయ్ (సి) సంగక్కర (బి) పెరీరా 22; రిజ్వాన్ చీమా (సి) జయవర్దనే (బి) మురళీధరన్ 37; గోర్డాన్ (సి) సంగక్కర (బి) కులశేఖర 4; ఖుర్రమ్ చోహన్ (సి) సంగక్కర (బి) కులశేఖర 4; బైద్వాన్ నాటౌట్ 16; బాలాజీరావు (సి) తరంగ (బి) మురళీధరన్ 6; ఒసిండె (బి) మెండిస్ 4; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (36.5 ఓవర్లలో ఆలౌట్) 122
వికెట్ల పతనం: 1-0, 2-8, 3-12, 4-42, 5-53, 6-68, 7-74, 8-103, 9-111
బౌలింగ్: కులశేఖర 6-2-16-3; పెరీరా 7-0-24-3; మెండిస్ 7.5-3-18-1; మురళీధరన్ 9-0-38-2; దిల్షాన్ 5-0-14-0; సమరవీర 2-0-4-1
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications