Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచ కప్ పోటీల్లో న్యూజిలాండ్ బోణీ: శ్రీలంక చిత్తు

క్రిస్ట్‌చర్చ్: ప్రపంచ కప్ వన్డే పోటీల్లో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 322 పరుగుల భార్యీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 46.1 ఓవర్లలోనే 233 పరుగులకు 98 పరుగుల తేడాతో శ్రీలంక చిత్తయింది. తిరుమనే (65), మాథ్యూస్ (46) తప్ప మరే బ్యాట్స్‌మన్ కూడా న్యూజిలాండ్ బౌలర్ల ముందు నిలదొక్కుకోలేకపోయాడు. నిజానికి, శ్రీలంక ఇన్నింగ్స్ మొదటి నుంచే తడబడుతూ ఆడింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, బౌల్ట్, మిల్నే, వెట్టోరీ, అండర్సన్ తలా రెండేసి వికెట్లు తీసుకున్నారు. బ్యాట్స్‌మెన్ మాత్రమే కాకుండా బౌలర్లు కూడా రాణించడంతో కివీసి సునాయస విజయాన్ని దక్కించుకుని ప్రపంచ కప్ పోటీల్లో శుభారంభం చేసింది.

న్యూజిలాండ్ నిర్దేశించిన 332 పరుగులను ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు అష్టకష్టాలు పడింది. 36 ఓవర్లకే 183 పరుగుల చేసి ఆరు వికెట్ల కోల్పోయింది. అప్పటికే న్యూజిలాండ్ బౌలర్లు బోల్ట్, మిల్నే, విట్టోరీలు చెరి రెండు వికెట్లు తీసుకున్నారు. శ్రీలంక ఆల్‌రౌండర్లు చతికల పడటంతో జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత కూడా ఏ మాత్రం కోలుకోలేదు.

ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా శ్రీలంకపై తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. శ్రీలంక బౌలర్లను ఉతికి ఆరేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 20015 పూల్ ఎలో తొలి మ్యాచ్ శనివారం న్యూజిలాండ్‌తో శ్రీలంక తలపడింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది.

brendon Meccullam

బ్రెండన్ మెకుకుల్లం 49 బంతుల్లో 65 పరుగులు చేయడం కలిసి వచ్చింది. గుప్తిల్ 49 పరుగులు చేశాడు. అండర్సన్ 46 బంతుల్లో 75 పరుగులు చేసి బ్యాటింగులో కీలకమైన పాత్ర పోషించాడు. విలియమ్సన్ 57 పరుగులు చేశాడు. టైలర్ (14),, ఇలియోట్ (29) అవుటైన తర్వాత న్యూజిలాండ్ వేగం పెంచి స్కోరును పెంచింది.

శ్రీలంక బౌలర్లలో కులశేఖర ఒక్క వికెట్ తీసుకోగా, లక్మల్, మెండీస్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. లసిత్ మలింగ భారీగా పరుగులు ఇచ్చుకుని ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. పది ఓవర్లలో 84 పరుగులు ఇచ్చుకున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+