For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దక్షిణాఫ్రికాపై పోరాడి గెలిచిన ఇంగ్లాండు, ఉత్కంఠ పోరు

By Pratap
England
చెన్నై: బ్రాడ్, అండర్సన్ చలువతో ఇంగ్లాండు దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. చెన్నైలో ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచకప్‌ గ్రూప్‌ 'బి' సమరంలో పటిష్టమైన దక్షిణాఫ్రికాను 6 పరుగుల తేడాతో ఓడించింది. లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు తడబడే బలహీనతను దక్షిణాఫ్రికా మరోసారి బయటపెట్టుకుంది. 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగి, ఒత్తిడికి తట్టుకోలేక ఓటమిని ఆహ్వానించింది. మూడు మ్యాచ్‌లు ఆడిన దక్షిణాఫ్రికాకు ఇదే తొలి ఓటమి. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచిన రవి బొపారా (60)కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వికెట్లేమీ కోల్పోకుండా 63 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళుతున్న దక్షిణాఫ్రికా జోరుకు బ్రేక్‌ పడింది. 15వ ఓవర్లో స్మిత్‌ (22)ను స్వాన్‌ ఔట్‌ చేశాడు. తర్వాత ఆమ్లా (42), కాసేపటికే కలిస్‌ (15) వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా వెనుకంజ వేసింది. అయినా 120 బంతుల్లో 54 పరుగులే చేయాల్సి రావడంతో ఆ జట్టు విజయంపై ఎవరికీ అనుమానం రాలేదు. ఐతే చెపాక్‌ పిచ్‌ స్లో బౌలర్లకు దాసోహం కావడంతో ఒక్కో పరుగు కోసం కీలక సమయంలో డివిలియర్స్‌ (25) బౌల్డ్‌ కావడం... డుప్లెసిస్‌ (17)ను బెల్‌ రనౌట్‌ చేయడంతో పరిస్థితి ఇంగ్లాండ్‌కు అనుకూలంగా మారింది.

54 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి రాగా, డుమిని (0), రాబిన్‌ పీటర్సన్‌ (3) కూడా వెనుదిరిగారు. 127 పరుగులకే 7 వికెట్లు. ఈ స్థితిలో వాన్‌విక్‌ (13), స్టెయిన్‌ (20; 31 బంతుల్లో 3X4) ఎనిమిదో వికెట్‌కు 33 పరుగులు జోడించారు. ఐతే 23 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన స్థితిలో వాన్‌విక్‌ను బ్రెస్నన్‌ బౌల్డ్‌ చేసి ఉత్కంఠ పెంచాడు. 48వ ఓవర్లో స్టెయిన్‌ను బ్రాడ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో దక్షిణాఫ్రికా ఆశలు ఆవిరయ్యాయి. బ్రాడ్‌ అదే ఓవర్‌ నాలుగో బంతికి మోర్కెల్‌ను కూడా ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌కు సంచలన విజయాన్నందించాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+