వరల్డ్ కప్: భారత్‌తో మ్యాచ్... పాక్ ఆటగాళ్ల గొడవ, జరిమానా
న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో తొలి బంతి ఇంకా పడలేదు. కానీ పాకిస్ధాన్ జట్టు ఆటగాళ్లపై జరిమానా విధించారు. ఎక్కడికి వెళ్లినా ఇష్టానుసారంగా ప్రవర్తించే అలవాటున్న పాక్ క్రికెటర్లు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లోనూ అదే విధానాన్ని అనుసరించారు. ఫలితంగా మాజీ కెప్టెన్ షహీద్ అఫ్రిదీ సహా ఎనిమిది పాక్ క్రికెటర్లపై నిర్వాహకులు ఒక్కొక్కరికీ 230 డాలర్ల జరిమానా విధించారు.
స్నేహితులతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన అఫ్రిదీ, ఓపెనర్ అహ్మద్ షెజాద్, మరో ఆరుగురు క్రికెటర్లు నిర్ణీత సమయానికి తిరిగి హోటల్‌కు రాలేదు. అయితే వారంతా ఇక్కడి నైట్ క్లబ్‌కు వెళ్లినట్లు సమాచారం. అంతే కాదు... పాకిస్ధాన్ ఆటగాడు షహజాద్ అయితే మరో అడుగు ముందుకేసి బాక్సర్‌తో అతను గొడవకు దిగినట్లు సమాచారం. పరిస్థితి అదుపు గొడవపడే వరకు వచ్చింది. చివరకు షహజాద్ క్షమాపణలు చెప్పడంతో వారంతా నైట్ క్లబ్ నుంచి బయటకు వచ్చారు.

దీనిపై జట్టు మేనేజర్ నవీద్ చీమా పాక్ బోర్డుకు ఫిర్యాదు చేశాడు. దాంతో పీసీబీ ఒక్కో ఆటగాడికి 230 డాలర్లు (దాదాపు రూ. 15 వేలు) జరిమానా విధించింది. అనంతరం ఆటగాళ్లు క్షమాపణ చెప్పారు. మరో సారి ఇలాంటి ఘటన పునరావృతమైతే, తక్షణమే టోర్నమెంట్ నుంచి బహిష్కరిస్తామని జట్టు మేనేజ్‌మెంట్ హెచ్చరించారు.
ఆస్టేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో మొత్తం 14 జట్లు పాల్గొంటున్నాయి. పాకిస్ధాన్ జట్టు గ్రూప్ బిలో ఉంది. ఫిబ్రవరి 15న చిరకాల ప్రత్యర్ధి భారత్‌తో జరగనున్న మ్యాచ్‌తో పాకిస్ధాన్ టోర్నీలో అరంగేట్రం చేయనుంది.
గతంలో కూడా పాకిస్ధాన్ ఆటగాళ్లు క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలు చాలానే ఉన్నాయి. 2010 ఇంగ్లాండ్‌లో పాకిస్ధాన్ కీలక ఆటగాళ్లు సల్మాన్ భట్, మహ్మద్ సమీ, మహ్మాద్ అమర్ స్ఫాట్ ఫిక్సింగ్ కేసులో దొరికిపోయిన విషయం తెలిసిందే. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నో బాల్స్ వేసేందుకు గాను డబ్బు తీసుకున్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications