For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ కప్: క్వార్టర్ ఫైనల్స్‌లో ఎవరితో ఎవరు... ఎక్కడ..?

By Nageswara Rao

సిడ్నీ: ఐసీసీ వరల్డ్ కప్‌లో మంగళవారంతో క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఆడనున్న నాలుగు జట్లు తెలిసిపోయాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి లీగ్ దశ పోటీలకు సంబంధించిన తాజా జాబితాను విడుదల చేసింది. క్వార్టర్‌లో తలపడనున్న పూల్ ఏలోని నాలుగు జట్ల వివరాలను వెల్లడించింది.

ఇక పూల్ బి నుంచి క్వార్టర్స్‌లో మంగళవారం నాటికి ఒక్క టీమిండియా చోటు దక్కించుకుంది. ఈ వరల్డ్ కప్‌లో వరుస విజయాలను టీమిండియా నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే క్వార్టర్స్‌లో టీమిండియాతో తలపడే జట్టు ఏదో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

అయితే క్వార్టర్స్‌లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్వార్టర్స్‌లో శ్రీలంక, ఆస్టేలియా, న్యూజిలాండ్‌లు చోటు దక్కించుకున్నాయి. పూల్ బిలో క్వార్టర్స్‌లో చోటు దక్కించుకునేందుకు పాకిస్ధాన్, ఐర్లాండ్, వెస్టిండిస్, దక్షిణాఫ్రికాలు తలపడుతున్న విషయం తెలిసిందే.

లీగ్ మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసిన జింబాబ్వే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఆఫ్ఘనిస్దాన్ ఇంటి బాట పట్టాయి.

World Cup 2015: Who plays who and where in quarter-finals?

క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్:

పూల్ ఏ నుంచి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్లు: న్యూజిలాండ్, ఆస్టేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక

పూల్ బి నుంచి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్లు: ఇండియా

క్వార్టర్ ఫైనల్ 1 - మార్చి 18 (బుధవారం) - శ్రీలంక Vs (ఇంకా ఖరారు కాలేదు) - సిడ్నీ ( ఉదయం 9 గంటలకు )

క్వార్టర్ ఫైనల్ 1 - మార్చి 19 (గురువారం) - బంగ్లాదేశ్ Vs (ఇంకా ఖరారు కాలేదు) - మెల్‌బోర్న్ ( ఉదయం 9 గంటలకు )

క్వార్టర్ ఫైనల్ 3 - మార్చి 20 (శుక్రవారం) - ఆస్టేలియా Vs (ఇంకా ఖరారు కాలేదు) - అడిలైడ్ ( ఉదయం 9 గంటలకు )

క్వార్టర్ ఫైనల్ 4 - మార్చి 21 (శనివారం) - న్యూజిలాండ్ Vs (ఇంకా ఖరారు కాలేదు) - వెల్లింగ్టన్ ( ఉదయం 6.30 గంటలకు )

సెమీ పైనల్స్ 1 - మార్చి 24 (ఆక్లాండ్)

సెమీ పైనల్స్ 2 - మార్చి 26 (సిడ్నీ)

మార్చి 29 - ఫైనల్ (మెల్ బోర్న్)

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+