అడిలైడ్: ఐసీసీ వరల్డ్ కప్‌లో లీగ్ దశలో తొలి రెండు మ్యాచ్‌లు ఓడినా, ఆ తర్వాత మ్యాచ్‌ల్లో పుంజుకొని పాకిస్ధాన్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మార్చి 20న అడిలైడ్‌లో పాకిస్ధాన్, ఆస్టేలియాతో తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో పాకిస్ధాన్ గెలిచి సెమీ ఫైనల్‌కు చేరితే పాక్ జట్టులోకి స్ఫిన్నర్ సయీద్ అజ్మల్‌ను ఆడించాలనే భావనలో పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ షహర్ యాన్ ఖాన్ అన్నారు. పొత్తి కడుపు చీలిక గాయం కారణంగా టోర్నమెంట్‌కి దూరమైన మొహ్మద్ ఇర్ఫాన్ స్ధానంలో అజ్మల్‌ను తీసుకోవాలని పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది.
పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్ యాన్ ఖాన్ మాట్లాడుతూ "గాయపడ్డ ఇర్ఫాన్ స్ధానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు. క్వార్టర్ ఫైనల్‌కు తక్కువ సమయం ఉండటంతో, ఎంపిక చేసిన ఆటగాడు ఆ సమయానికి ఆస్టేలియా చేరుకోలేడు. పాక్ సెమీస్‌కు చేరితే, ఇర్ఫాన్ స్ధానాన్ని మరో ఆటగాడితో భర్తీ చేస్తాం ఆ ఆటగాడు అజ్మల్ కావచ్చు" అని పేర్కొన్నారు.

అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సరిగాలేదంటూ ఐసీసీ కొన్నాళ్ల కిందట అతడిపై సస్పన్షన్ విధించిన సంగతి తెలిసిందే. అనంతరం అతడికి పరీక్షలు నిర్వహించి ప్రస్తుత బౌలంగ్ శైలి నిబంధనలకు అనుగుణంగా ఉందని సర్టిఫికెట్ ఇచ్చింది.
ఇక సయీద్ అజ్మల్ కూడా ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లోనే ఓ టెలివిజన్ ఛానల్‌కు వ్యాఖ్యాతగా వ్వవహరిస్తున్నాడు. ఐసీసీ తాజా నిబంధనల ప్రకారం జట్టులోని ఆటగాడు గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలగితే, అతని స్ధానంలో తుది జట్టులో లేని ఆటగాడిని తీసుకునే వెసులుబాటు ఉంది.