వరుసగా నాలుగోసారి: మాగ్నస్ కార్ల్‌సన్‌దే చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్

హైదరాబాద్: మూడు వారాల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ ఎవరో తెలిసింది. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ మళ్లీ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 12 గేముల్లో కార్ల్‌సన్‌ను గట్టిగా ప్రతిఘటించి, ప్రతిసారీ పాయింట్లు పంచుకున్న అమెరికా చెస్ ప్లేయర్ ఫాబియానో కరువానా టైబ్రేక్‌లో మాత్రం విఫలమయ్యాడు.

నాలుగు గేమ్‌ల టైబ్రేక్‌లో వరుసగా మూడు విజయాలు
ఈ క్రమంలో నాలుగు గేమ్‌ల టైబ్రేక్‌లో వరుసగా మూడు విజయాలు సాధించిన కార్ల్‌సన్ చాంపియన్‌గా నిలిచాడు. వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌ను కార్ల్‌సన్ గెలవడం ఇది నాలుగవ సారి. 2013లో అప్పటి ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి తొలిసారి ఛాంపియన్ అయిన కార్ల్‌సన్ ఆ తర్వాతి ఏడాది కూడా ఆనంద్‌పైనే నెగ్గడం విశేషం.

రాపిడ్ టై బ్రేకర్ గేమ్‌లో కార్ల్‌సన్ 3-0 తేడాతో నెగ్గిన కార్ల్‌సన్
12 రౌండ్లలో ఒక రకంగా ఆడిన కార్ల్‌సన్.. రాపిడ్ టైబ్రేక్‌లో భిన్నమైన ప్రదర్శన చేశాడు. రాపిడ్ టై బ్రేకర్ గేమ్‌లో కార్ల్‌సన్ 3-0 తేడాతో నెగ్గాడు. సెంట్రల్ లండన్‌లోని సౌండ్‌ప్రూఫ్ స్టూడియోలో గత 20 రోజుల నుంచి ఈ టోర్నీ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కార్ల్‌సన్, ఫాబియోలు హోరాహోరీగా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అలరించారు.

15 గేమ్‌ల తర్వాత విజేతగా కార్ల్‌సన్
అయితే, చివరకు 15 గేమ్‌ల తర్వాత కార్ల్‌సన్ విజేతగా నిలిచాడు. కాగా, టైబ్రేక్‌ను పక్కన పెడితే.. అంతకుముందు నిర్ణీత 12 గేమ్‌ల్లో కరువానా ఆడిన తీరు అందరి మన్ననలను అందుకుంది. గత ముగ్గురు కార్ల్‌సన్ ప్రత్యర్థులతో పోలిస్తే కరువానా గట్టి పోటీనే ఇచ్చాడు. గత ఎనిమిదేళ్లుగా చెస్‌లో కార్ల్‌సన్ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications