Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్ ఆరాధ్య క్రికెటర్ ఎవరో తెలుసా..?

గుకేష్ దొమ్మరాజు... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. 18 ఏళ్లకే చదరంగంలో వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి సత్తా చాటాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో డింగ్ లిరెన్‌ను బోల్తా కొట్టించి చదరంగపు రారాజుగా నిలిచాడు. భారత్‌ మరోసారి గర్వపడేలా చేశారు. డింగ్ లిరెన్‌ను 7.5-6.5 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించాడు. దీంతో అప్పటి వరకు అత్యంత చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా ఉన్న విశ్వనాథన్ ఆనంద్ రికార్డును ఈ కుర్రాడు చెరిపివేసి తాను ఛాంపియన్‌గా అవతరించాడు. చిన్న వయస్సులోనే ప్రైజ్ మనీ కింద రూ.11.34 కోట్లు గెల్చుకున్నాడు.డింగ్‌కు చెక్ చెప్పి రూ.11.34 కోట్లు గెలుచుకోగా... భారత్‌లో ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ రూ.4.67 కోట్ల పన్‌తో చెక్‌మేట్‌లా వ్యవహరించింది.

భారత్‌లో అందరికీ క్రికెట్ అంటే సుపరిచతమే. క్రికెట్‌ను ఒక మతంలా భారతీయులు భావిస్తారు. అలానే ప్రతి ఒక్కరికి తన అభిమాన క్రికెటర్లంటూ ఉన్నారు. ఇందుకు మన గుకేష్ కూడా మినహాయింపు కాదు. అందరిలానే గుకేష్‌కు కూడా ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్లున్నారు. గుకేష్ దొమ్మరాజు తెలుగు కుటుంబానికి చెందిన వాడే అయినప్పటికీ తమిళనాడులో తన ఫ్యామిలీ సెటిల్ అయ్యింది. ఇక తమిళనాడులో అయితే క్రికెట్ ఫీవర్ పీక్స్‌లో ఉంటుంది. గుకేష్ కూడా క్రికెట్‌ను చాలా బాగా ఎంజాయ్ చేస్తాడని తెలిసింది. ఈ మధ్యే చెన్నైకి చెందిన విజిల్ పోడు ఆర్మీ ఓ వీడియోను షేర్ చేయడంతో ఈ విషయం తేటతెల్లమైంది.

World Chess Champion Gukesh admires Dhoni his Favorite Cricketer Here is why

విజిల్ పోడు ఆర్మీ రిలీజ్ చేసిన ఈ వీడియోలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి గుకేష్ మాట్లాడాడు. అసలే ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఆ కల్ట్ వేరే లెవెల్ ఉంటుంది. తనకు ఇష్టమైన క్రీడాకారుడు ఎవరని గుకేష్‌ను అడగగా.. తాను చిన్నప్పటి నుంచే ధోనీకి వేరే లెవెల్ అభిమానినంటూ చెప్పుకొచ్చాడు.ఇప్పుడు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జోకోవిక్‌ను కూడా అభిమానిస్తానని ఇద్దరూ ఇద్దరే అని చెప్పుకొచ్చాడు. ఇద్దరూ వారి వారి రంగంలో గొప్పవారని తెలిపాడు.

ఇండియన్ క్రికెట్‌పై ధోనీ ముద్ర చాలా ప్రత్యేకమైనది. అతని నాయకత్వంలో భారత్ మూడు ఐసీసీ టైటిళ్లను సొంతం చేసుకుంది. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీలను దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో ఒక సెన్షేషన్‌లా మారాడు ధోనీ. 2025 ఐపీఎల్‌లో ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.4 కోట్లకు రీటెయిన్ చేసుకుంది. ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు టైటిల్ కైవసం చేసుకుంది. అందుకే ఈ యంగ్ గన్ గుకేష్‌కు ధోనీ అంటే అంత ఇష్టమట.

Story first published: Tuesday, December 17, 2024, 13:59 [IST]
Other articles published on Dec 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+