Paris Olympics 2024: షాట్‌పుటర్ అభా ఖతువాకు ఏమైంది?
పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది. మరో తొమ్మిది రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. జులై 26 నుంచి మొదలయ్యే ఈ మహా సమరం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో మించి మరిన్ని పతకాలు సాధించాలనే పట్టుదలతో భారత క్రీడాకారులు పారిస్‌కు సిద్ధమయ్యారు. పతకాల వేట కోసం భారత్ నుంచి 117 మంది బరిలోకి దిగుతున్నారు.
వాళ్లతో పాటు 140 మంది సహాయ సిబ్బంది పారిస్‌కు వెళ్తున్నారు. ఈ వివరాలను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధికారింకగా బుధవారం ప్రకటించింది. అయితే ఈ జాబితాలో షాట్‌పుటర్ అభా ఖతువా పేరు మిస్ అయ్యింది. అభా ర్యాంకింగ్స్ ద్వారా పారిస్ ఒలింపిక్స్ అర్హత సాధించింది. కానీ ఆమె పేరు జాబితాలో లేకపోవడం గమనార్హం. దీని గురించి ఐఓఏతో పాటు వరల్డ్ అథ్లెటిక్స్ మౌనం పాటిస్తుంది. అభా ఖతువా ఎందుకు పారిస్‌కు వెళ్లట్లేదనే విషయంపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.

అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తొలుత ట్రాంక్ అండ్ ఫీల్డ్ జట్టులో 30 మందిని విశ్వక్రీడలకు ప్రకటించింది. దీనిలో 29 ఏళ్ల అభా ఉంది. కానీ తాజాగా ఆ జాబితాను 29 మందికి కుదించింది. ఆమె ఒలింపిక్స్ దూరమవ్వడానికి గాయాలు, డోపింగ్ కారణమా అనే విషయంపై ఎలాంటి ప్రకటన లేదు. ఈ విషయం గురించి 'మైఖేల్' వరల్డ్ అథ్లెటిక్స్‌ను వివరణ కోరింది. కానీ ఆ సమాఖ్య మౌనం పాటిస్తుంది.
బెంగాల్‌కు చెందిన షాట్‌పుటర్ అభా తన సహచరులతో కలిసి జులై 11న టర్కీలోని స్పాలాకు చేరింది. అక్కడ అథ్లెటిక్స్ బృందంతో కలిసి శిక్షణ పొందుతోంది. కానీ ఆమెకు గాయమైనట్లుగా సమాచారం రాలేదు. అంతేగాక ఆమె డోపింగ్ దొరికినట్లు కూడా వార్తలు రాలేదు. కానీ ఆమె పేరు జాబితాలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అభా సోదరుడి భార్య మరణించడంతో వారి కుటుంబం విషాదంలో ఉంది. అయినప్పటికీ దేశం కోసం పతక లక్ష్యంగా ఆమె దుఃఖాన్ని దిగమింగి బయలుదేరింది. కానీ తాజాగా ఆమె పేరు అథ్లెటిక్స్ లిస్ట్‌లో లేకపోవడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications