Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్యాన్స్ మనసు గెలిచాడు: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అరుదైన సంఘటన

World Athletics Championships: Braima Suncar Dabo Helps Jonathan Busby as Sporting Gesture Wins Hearts


హైదరాబాద్:
దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఐదు వేల మీటర్ల పరుగు పందెంలో క్రీడా స్ఫూర్తికి సంబంధించిన ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దోహా కలీఫా స్టేడియంలో జరిగిన ఐదు వేల మీటర్ల పరుగు పందెంలో అరుబా దేశానికి రన్నర్‌ 33 ఏళ్ల జొనాథన్‌ బస్బీ పైనల్ లాప్‌లో అలసిపోయి కిందపడబోయాడు. అదే సమయంలో అతడి పక్కనే పరిగెత్తుతున్న గున్యాకు చెందిన డాబో తన పరుగును ఆపుకొని బస్బీకి సాయమందించాడు. ఫైనల్ లాప్‌ను పూర్తి చేసేవరకు అతడిని తోడుకుని పరుగు పూర్తి చేశాడు.

మరోవైపు తన తోటి రన్నర్లంతా పరుగును పూర్తి చేశారు. ఐదు నిమిషాల తర్వాత గున్యాకు చెందిన డాబో.. అరుబా రన్నర్‌తో కలిసి ఫినిషింగ్ పాయింట్‌ని టచ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రేసులో డాబో చూపిన క్రీడాస్ఫూర్తి పట్ల అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మ్యాచ్ అనంతరం 26 ఏళ్ల డాబో మాట్లాడుతూ "అతడు రేసుని పూర్తి చేయడానికి నేను సాయపడ్డాను. అతడు ఫినిషింగ్ లైన్‌ని చేరుకోవాలనేది నా కోరిక. ఆ పరిస్థితిలో ఎవరు ఉన్నా అలానే చేస్తారు" అని చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, September 28, 2019, 13:14 [IST]
Other articles published on Sep 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+