Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిరాశపరిచిన నీరజ్ చోప్రా, సచిన్ యాదవ్.. జావెలిన్‌లో కొత్త ఛాంపియన్

World Atheletics Championship 2025: జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్ గోల్డ్ మెడల్ గెలిచాడు. తుది పోరులో కెషోర్న్ వాల్కాట్ తన నాలుగో ప్రయత్నంలో ప్రయత్నంలో 88.16 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. గ్రెనెడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ 87.38 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్ ను సొంతం చేసుకోగా.. అమెరికాకు కర్టిస్ థాంప్సన్ 86.67 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

భారత స్టార్ అథ్లెట్లు నీరజ్ చోప్రా, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ ఈసారి పతకం సాధించలేకపోయారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన నీరజ్ చోప్రా తన అత్యుత్తమ త్రో 84.03 మీటర్లతో 8వ స్థానంలో నిలిచాడు. మరోవైపు పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 82.75 మీటర్ల త్రోతో 10వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. ఇండియాకు చెందిన మరో అథ్లెట్ సచిన్ యాదవ్ అద్భుతంగా రాణించి 86.27 మీటర్ల ఉత్తమ త్రోతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. సచిన్ మూడో స్థానానికి కేవలం 40 సెంటిమీటర్ల దూరంలో ఆగిపోయాడు. అంటే అమెరికాకు చెందిన కర్టిస్ థాంప్సన్ 86.67 మీటర్లు విసరగా.. సచిన్ యాదవ్ 86.27 మీటర్ల దూరం విసిరాడు.

World Athletics Championship 2025 New Javelin Champion Emerges as Neeraj Chopra and Sachin Yadav Disappoint

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో జావెలిన్ త్రోలో గత విజేతల జాబితా ఇదే..

1983-హెల్సింకి(వేదిక)-డెట్లెఫ్ మైఖేల్ (తూర్పు జర్మనీ)
1987-రోమ్-సెప్పో రాటీ (ఫిన్లాండ్)
1991-టోక్యో-కిమ్మో కిన్నునెన్ (ఫిన్లాండ్)
1993-స్టట్‌గార్ట్-జాన్ జెలెజ్నీ (చెక్ రిపబ్లిక్)
1995-గోథెన్‌బర్గ్-జాన్ జెలెజ్నీ (చెక్ రిపబ్లిక్)
1997-ఏథెన్స్-మారియస్ కార్బెట్ (దక్షిణ ఆఫ్రికా)
1999- సెవిల్లే-అకీ పార్వియైనెన్ (ఫిన్లాండ్)
2001-ఎడ్మంటన్- జాన్ జెలెజ్నీ (చెక్ రిపబ్లిక్)
2003-సైంట్-డెనిస్- సెర్గీ మకరోవ్ (రష్యా)
2005-హెల్సింకి-ఆండ్రస్ వర్నిక్ (ఎస్టోనియా)
2007-ఒసాకా-టెరో పిట్‌కమాకీ (ఫిన్లాండ్)
2009-బెర్లిన్-ఆండ్రియాస్ థోర్కిల్డ్‌సెన్ (నార్వే)
2011-డేగు-మతియాస్ డి జోర్డో (జర్మనీ)
2013-మాస్కో-విటెజ్స్లావ్ వెసెలీ (చెక్ రిపబ్లిక్)
2015-బీజింగ్-జూలియస్ యెగో (కెన్యా)
2017-లండన్-జోహాన్నెస్ వెట్టర్ (జర్మనీ)
2019 -దోహా-ఆండర్సన్ పీటర్స్ (గ్రెనడా)
2022 -యూజీన్-ఆండర్సన్ పీటర్స్ (గ్రెనడా)
2023-బుడాపెస్ట్- నీరజ్ చోప్రా (భారత్)
2025-టోక్యో-కెషోర్న్ వాల్కాట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో)

Story first published: Thursday, September 18, 2025, 17:49 [IST]
Other articles published on Sep 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+