Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ మరో స్వర్ణాన్ని సాధించి పెట్టిన మహిళా ఆర్చర్లు

Dola Banerjee
న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మరో స్వర్ణం సాధించింది. మహిళల రికర్వ్‌ ఆర్చరీ టీమ్ ఈవెంటులో శుక్రవారం భారత్‌ స్వర్ణం గెలుచుకుంది. దీంతో భారత్ 2010 కామన్ వెల్త్ క్రీడల్లో 15 స్వర్ణ పతకాలు సాధించింది. డోలా బెనర్జీ, దీపికా కుమారి, బొంబయాల దేవి లైసారామ్ ఇంగ్లండ్ టీమ్ పై హోరాహోరి పోరాడి ఈ స్వర్ణాన్ని 207-206 స్కోరుతో చేజిక్కించుకున్నారు. కామన్ వెల్త్ క్రీడల్లో ఆర్చరీలో భారత్ కు ఇది తొలి స్వర్ణం.

గురువారం ఇండియన్ కాంపౌండ్ ఆర్చర్స్ పురుషుల, స్త్రీల ఈవెంట్లలో రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు ఈ పతకాలు సాధించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జిజ్ఞాస్, రీతూ ఈ పతకాలు సాధించారు. రెజ్లింగ్ విభాగంలో భారత్ కు చెందిన గీత గురువారం స్వర్ణ పతకం సాధించింది. గురుప్రీత్ సింగ్, విజయసింగ్ 25 మీటర్ల పిస్టల్ పెయిర్స్ లో, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో గురువారం ఓంకార్ సింగ్ తో కలిసి రెండు స్వర్ణపతకాలు సాధించారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+