కామన్వెల్త్: భారత్‌కు 504 పతకాలు, 17 ఏళ్లుగా ఇలా జరగడం ఐదో సారి

 With rich haul at Gold Coast Commonwealth Games 2018, India cross the 500-medal milestone at CWG

హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అడుగు పెట్టిన సంవత్సరం కేవలం ఒకే ఒక్క కాంస్యంతో సరిపెట్టుకుంది. అంచెలంచెలుగా ఎదిగిన భారత్ ఇప్పటి వరకు ఈ క్రీడల్లో అత్యధికంగా 101 పతకాలను గెలుచుకుంది. కాగా ఈ ఏడాది జరిగిన 21వ కామన్వెల్త్ గేమ్స్‌ను భారత్ ఘనంగానే ముగించింది. మొత్తం 66 మెడల్స్‌తో మూడో స్థానంలో నిలిచింది. అందులో 26 గోల్డ్ మెడల్స్, 20 సిల్వర్, 20 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా మొత్తం పతకాల సంఖ్య 504కు చేరింది. 17 ఏళ్లుగా పతకాల సాధించడంలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.

1934లో ఇంగ్లండ్‌లో మొదలైన కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా ఇప్పటివరకు 17 సార్లు పాల్గొన్నది. ఈ గేమ్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన 2010లో సొంతగడ్డపై జరిగిన గేమ్స్‌లోనే చేయడం విశేషం. ఆ గేమ్స్‌లో 38 గోల్డ్ మెడల్స్‌తోపాటు మొత్తం 101 పతకాలతో రెండోస్థానంలో నిలిచింది. అంతకుముందు 2002లో మాంచెస్టర్‌లో జరిగిన గేమ్స్‌లో 69 పతకాలు సాధించింది. అందులో 30 గోల్డ్, 22 సిల్వర్, 17 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు గోల్డ్‌కోస్ట్‌లో 66 పతకాలు సాధించి ఓవరాల్ లిస్ట్‌లో మూడోస్థానంలో నిలిచింది.

Year Gold Gold Silver Silver Bronze Bronze Total Position
1934 0 0 1 1 12th
1938 0 0 0 0 NA
1954 0 0 0 0 NA
1958 2 1 0 3 8th
1966 3 4 3 10 8th
1970 5 3 4 12 6th
1974 4 8 3 15 6th
1978 5 5 5 15 6th
1982 5 8 3 16 6th
1990 13 8 11 32 5th
1994 6 12 7 25 6th
1998 7 10 8 25 7th
2002 30 22 17 69 4th
2006 22 17 11 50 4th
2010 38 27 36 101 2nd
2014 15 30 19 64 5th
2018 26 20 20 66 3rd
Total 181 174 148 504

ఇవన్నీ కలిపి మొత్తం మెడల్స్ సంఖ్య 504కు చేరింది. అందులో 181 గోల్డ్, 174 సిల్వర్, 148 బ్రాంజ్ మెడల్స్ సాధించింది.

2018కి గాను జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో.. భారత్ 26 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. వెయిట్‌లిఫ్టర్లు మొదలుపెట్టిన పతకాల వేటను తర్వాత షూటర్లు, రెజ్లర్లు, బాక్సర్లు, బ్యాడ్మింటన్ స్టార్లు కొనసాగించారు. ఈసారి అథ్లెటిక్స్‌లోనూ ఓ గోల్డ్ మెడల్ రావడం విశేషం. 2018 గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన 26 మంది భారత అథ్లెట్లు వీళ్లే.

Neeraj Chopra Men's Javelin Throw
Saina Nehwal Women's Singles
India Mixed Team Event
Gaurav Solanki Men's 52kg
Vikas Krishnan Men's 75kg
MC Mary Kom Women's 45-48kg
Jitu Rai Men's 10m Air Pistol
Anish Men's 25m Rapid Fire Pistol
Sanjeev Rajput Men's 50m Rifle 3 Positions
Manu Bhaker Women's 10m Air Pistol
Heena Sidhu Women's 25m Pistol
Tejaswini Sawant Women's 50m Rifle 3 Positions
Shreyasi Singh Women's Double Trap
India Men's Team
Manika Batra Women's Singles
India Women's Team
Sathish Kumar Sivalingam Men's 77kg
Venkat Rahul Ragala Men's 85kg
Chanu Saikhom Mirabai Women's 48kg
Sanjita Chanu Khumukcham Women's 53kg
Punam Yadav Women's 69kg
Sumit Men's Freestyle 125 kg
Rahul Aware Men's Freestyle 57 kg
Bajrang Men's Freestyle 65 kg
Kumar Sushil Men's Freestyle 74 kg
Vinesh Women's Freestyle 50 kg

కామన్వెల్త్ గేమ్స్ ఇచ్చిన స్ఫూర్తితో ఇండియన్ అథ్లెట్లు ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌పై దృష్టి సారించారు. ఈ ఏడాది ఆగస్ట్ 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబాంగ్‌లలో ఈ గేమ్స్ జరగనున్నాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, April 15, 2018, 15:08 [IST]
Other articles published on Apr 15, 2018
POLLS

Get breaking news alerts from myKhel

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more