
హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అడుగు పెట్టిన సంవత్సరం కేవలం ఒకే ఒక్క కాంస్యంతో సరిపెట్టుకుంది. అంచెలంచెలుగా ఎదిగిన భారత్ ఇప్పటి వరకు ఈ క్రీడల్లో అత్యధికంగా 101 పతకాలను గెలుచుకుంది. కాగా ఈ ఏడాది జరిగిన 21వ కామన్వెల్త్ గేమ్స్‌ను భారత్ ఘనంగానే ముగించింది. మొత్తం 66 మెడల్స్‌తో మూడో స్థానంలో నిలిచింది. అందులో 26 గోల్డ్ మెడల్స్, 20 సిల్వర్, 20 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా మొత్తం పతకాల సంఖ్య 504కు చేరింది. 17 ఏళ్లుగా పతకాల సాధించడంలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.
1934లో ఇంగ్లండ్‌లో మొదలైన కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా ఇప్పటివరకు 17 సార్లు పాల్గొన్నది. ఈ గేమ్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన 2010లో సొంతగడ్డపై జరిగిన గేమ్స్‌లోనే చేయడం విశేషం. ఆ గేమ్స్‌లో 38 గోల్డ్ మెడల్స్‌తోపాటు మొత్తం 101 పతకాలతో రెండోస్థానంలో నిలిచింది. అంతకుముందు 2002లో మాంచెస్టర్‌లో జరిగిన గేమ్స్‌లో 69 పతకాలు సాధించింది. అందులో 30 గోల్డ్, 22 సిల్వర్, 17 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు గోల్డ్‌కోస్ట్‌లో 66 పతకాలు సాధించి ఓవరాల్ లిస్ట్‌లో మూడోస్థానంలో నిలిచింది.
| Year | Gold Gold | Silver Silver | Bronze Bronze | Total | Position |
| 1934 | 0 | 0 | 1 | 1 | 12th |
| 1938 | 0 | 0 | 0 | 0 | NA |
| 1954 | 0 | 0 | 0 | 0 | NA |
| 1958 | 2 | 1 | 0 | 3 | 8th |
| 1966 | 3 | 4 | 3 | 10 | 8th |
| 1970 | 5 | 3 | 4 | 12 | 6th |
| 1974 | 4 | 8 | 3 | 15 | 6th |
| 1978 | 5 | 5 | 5 | 15 | 6th |
| 1982 | 5 | 8 | 3 | 16 | 6th |
| 1990 | 13 | 8 | 11 | 32 | 5th |
| 1994 | 6 | 12 | 7 | 25 | 6th |
| 1998 | 7 | 10 | 8 | 25 | 7th |
| 2002 | 30 | 22 | 17 | 69 | 4th |
| 2006 | 22 | 17 | 11 | 50 | 4th |
| 2010 | 38 | 27 | 36 | 101 | 2nd |
| 2014 | 15 | 30 | 19 | 64 | 5th |
| 2018 | 26 | 20 | 20 | 66 | 3rd |
| Total | 181 | 174 | 148 | 504 |
ఇవన్నీ కలిపి మొత్తం మెడల్స్ సంఖ్య 504కు చేరింది. అందులో 181 గోల్డ్, 174 సిల్వర్, 148 బ్రాంజ్ మెడల్స్ సాధించింది.
2018కి గాను జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో.. భారత్ 26 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. వెయిట్‌లిఫ్టర్లు మొదలుపెట్టిన పతకాల వేటను తర్వాత షూటర్లు, రెజ్లర్లు, బాక్సర్లు, బ్యాడ్మింటన్ స్టార్లు కొనసాగించారు. ఈసారి అథ్లెటిక్స్‌లోనూ ఓ గోల్డ్ మెడల్ రావడం విశేషం. 2018 గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన 26 మంది భారత అథ్లెట్లు వీళ్లే.
| Neeraj Chopra | Men's Javelin Throw |
| Saina Nehwal | Women's Singles |
| India | Mixed Team Event |
| Gaurav Solanki | Men's 52kg |
| Vikas Krishnan | Men's 75kg |
| MC Mary Kom | Women's 45-48kg |
| Jitu Rai | Men's 10m Air Pistol |
| Anish | Men's 25m Rapid Fire Pistol |
| Sanjeev Rajput | Men's 50m Rifle 3 Positions |
| Manu Bhaker | Women's 10m Air Pistol |
| Heena Sidhu | Women's 25m Pistol |
| Tejaswini Sawant | Women's 50m Rifle 3 Positions |
| Shreyasi Singh | Women's Double Trap |
| India | Men's Team |
| Manika Batra | Women's Singles |
| India | Women's Team |
| Sathish Kumar Sivalingam | Men's 77kg |
| Venkat Rahul Ragala | Men's 85kg |
| Chanu Saikhom Mirabai | Women's 48kg |
| Sanjita Chanu Khumukcham | Women's 53kg |
| Punam Yadav | Women's 69kg |
| Sumit | Men's Freestyle 125 kg |
| Rahul Aware | Men's Freestyle 57 kg |
| Bajrang | Men's Freestyle 65 kg |
| Kumar Sushil | Men's Freestyle 74 kg |
| Vinesh | Women's Freestyle 50 kg |
కామన్వెల్త్ గేమ్స్ ఇచ్చిన స్ఫూర్తితో ఇండియన్ అథ్లెట్లు ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌పై దృష్టి సారించారు. ఈ ఏడాది ఆగస్ట్ 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబాంగ్‌లలో ఈ గేమ్స్ జరగనున్నాయి.