Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫీల్గింగ్ మెరుగుపడింది కాబట్టి భారత్ ఫేవరెట్ జట్టు: వివియన్

Vivian Richards
కోల్‌కత్తా: ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టు ఫీల్గిండ్ చాలా మెరుగుపడిందని, దీంతో ప్రపంచ కప్‌లో ఫేవరెట్ జట్టు అదేనని వెస్టిండీస్ క్రికెట్ మాజీ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అభిప్రాయపడ్డారు. దాంతో ప్రపంచ కప్‌లో భారత్ విజయావకాశాలు మెరుగు పడ్డాయని ఆయన అన్నారు. పవర్ ప్లే పేరుతో క్రికెట్‌పై జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన గత రాత్రి పాల్గొన్నారు. భారత క్రికెటర్లలో మానసికంగా కూడా ఎంతో మార్పు వచ్చిందని, మైదానంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని, కోచ్ గ్యారీ కిర్‌స్టన్ వంటివారికి ఆ క్రెడిట్ దక్కుతుందని ఆయన అన్నారు.

మంచి ఫీల్డింగ్ ప్రపంచ కప్ పోటీల్లో విజయాన్ని సాధించి పెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ముందుండి ధోనీ జట్టును నడిపిస్తున్నాడని, నాయకుడు తాను కూడా బాగా ఆడాలని ఆయన అన్నారు. మంచి ఫీల్డింగ్ ప్రపంచ కప్ పోటీల్లో విజయాన్ని సాధించి పెడుతుందన్న వివియన్ రిచర్డ్స్ అభిప్రాయంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఏకీభవించారు. ప్రపంచ కప్ పోటీల్లో ఫీల్డింగ్ అత్యంత కీలకమైందని ఆయన అన్నారు. ప్రపంచ కప్‌ను గెలుచుకునే సత్తా భారత్‌కు ఉందని, ఆస్ట్రేలియా మరో ఫేవరెట్ జట్టు అని, బౌలర్ బ్రెట్ లీ దూకుడుగా ఆడి సత్తా చాటుతాడని ఆయన అన్నారు. భారత మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+