Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూమర్లు కావు నిజాలే.. మాపై సైబర్ దాడులు జరిగాయ్..

Winter Olympics was hit by cyber-attack, officials confirm

హైదరాబాద్: వింటర్‌ ఒలింపిక్స్‌పై సైబర్‌ దాడులు జరిగిన మాట వాస్తవమేనని క్రీడల నిర్వాహకులు ధ్రువీకరించారు. ప్రారంభోత్సవానికే ఈ దాడి జరిగిందని నిర్వహకులు నిర్ధారించారు.

ప్యాంగ్ చాంగ్ వేదికగా జరిగిన ఈ వేడుకలలో దాడులు జరిగినందుకు రష్యాదే ప్రదాన పాత్ర ఉందంటూ రూమర్లు వస్తున్నాయి.

ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగే సమయం ముందు నుంచి ప్యాంగ్ చంగ్ 2018 వెబ్‌సైట్ పనిచేయకుండా పోయింది. దాదాపు 12గంటల పాటు అందుబాటులో లేకుండా పోవడంతో ప్రేక్షకులు టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. శనివారం ఉదయం 8 గంటల సమయానికి సదరు సైట్ పున:ప్రారంభమైంది.

అయితే దీనివల్ల ఎటువంటి విపత్కర పరిణామాలు సంభవించలేదని తెలిపారు. సైబర్‌ దాడులకుగల కారణాలేమిటో తెలియజేయలేదు. ఈ సైబర్‌ దాడుల వెనుక రష్యా హస్తముందన్న అనుమానాలను కొట్టివేస్తూ భద్రతా కారణాల దృష్ట్యా సైబర్‌ దాడుల విషయాన్ని బహిర్గతం చేయలేదని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధికార ప్రతినిధి మార్క్‌ ఆడమ్స్‌ అన్నారు.

మాకు ఎటువంటి సంబంధం లేదు: రష్యా
ప్రారంభోత్సవం రోజున అధికారిక వెబ్‌సైట్‌, ఇంటర్నెట్‌లపై సైబర్‌ హ్యాకర్స్‌ దాడులు చేశారు. తమ అథ్లెట్లపై ఐఓసీ నిషేధ మున్న నేపథ్యంలో, తమపై అభాండాలు వేసేందుకు పాశ్చాత్య మీడియా ప్రయత్నిస్తోందని రష్యా పేర్కొంది. ఆ దాడుల వెనుక ఉన్నవారి పేర్లు బయటపెట్టి నిజాలు తేటతెల్లడం చేయమంటూ నిలదీసింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 12, 2018, 10:52 [IST]
Other articles published on Feb 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+