Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్కొక్కరికీ.. 38 కంటే ఎక్కువ కండోమ్‌లు ఇవ్వలేం

Winter Olympics: Record number of condoms given to athletes

హైదరాబాద్: వింటర్ ఒలింపిక్స్ దక్షిణకొరియా వేదికగా ఫిబ్రవరి 9 నుంచి మొదలైయ్యాయి. అయితే అక్కడ చలికి తట్టుకోలేక పోతున్నామంటూ క్రీడాకారుల ఆవేదన, వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని విశ్లేషకుల అంచనాతో పాటు మరో ఆక్రందనా వినిపిస్తోంది. 'ఇక్కడ కండోమ్‌ల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఒక్కొక్కరికీ 39 మాత్రమే ఇవ్వగలం' అంటూ నిర్వహక సంఘం బాధను వెల్లగక్కుతోంది.

ఇదీ వింటర్‌ ఒలింపిక్స్‌లో అథ్లెట్ల పరిస్థితి. అందుకే నిర్వాహకులూ ఘనంగానే ఏర్పాట్లు చేశారు. లక్షా పదివేల కండోమ్‌లు పంచారు. ఒకొక్క వ్యక్తికి దాదాపు 38 కండోమ్‌లు అందుబాటులో ఉంచారు. అన్నింటిని అథ్లెట్లు ఉపయోగించకపోవచ్చన్నారు. అయితే కండోమ్‌లకు డిమాండ్‌ మాత్రం భారీగానే ఉందని వీటిని ఉచితంగా పంచిపెట్టిన సంస్థ చెబుతోంది.

అదే స్థాయిలో డేటింగ్ లోనూ..:
ఆ ప్రాంతంలో డేటింగ్ యాప్ సైతం బాగా వాడుకలో ఉందంట. క్రీడాకారులు తమ ప్రొఫైళ్లను అందులో పొందుపరచి తోడు కోసం వెదుకుతున్నారట. 2012లో ఆరంభమైన 'టిండర్' డేటింగ్‌ యాప్‌ను అత్యధికంగా అమెరికా అథ్లెట్లు ఉపయోగిస్తున్నారు. ప్యాంగ్‌చాంగ్‌ ప్రాంతంలో తమ యాప్‌ వాడకం విపరీతంగా పెరిగిందని టిండర్‌ కూడా ధ్రువీకరించింది.

ఇరవై సంవత్సరాలలో లేనంత చలిని తట్టుకోవడానికి క్రీడాకారులు ఈ ప్రత్యామ్నాయాన్ని అవలంభిస్తున్నారా..? క్రీడాకారులకు ఇలా కండోమ్‌లను సియోల్ ఒలింపిక్స్ 1988 నుంచి పంచిపెట్టడం మొదలుపెట్టారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 14, 2018, 10:58 [IST]
Other articles published on Feb 14, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+