
హైదరాబాద్: శీతాకాల ఒలింపిక్స్ సమరం మొదలైంది. దక్షిణకొరియా వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో తొలి సారిగా స్వీడన్ దేశానికి స్వర్ణం దొరికింది. స్వీడన్‌కు చెందిన చార్లోట్ కలా గెలుచుకుంది. మహిళల స్కయథ్లాన్ క్రాస్ కంట్రీ రేసులో ఆమె విజేతగా నిలిచింది.
నార్వేకు చెందిన మారిట్ జోర్గెన్ రజతం సాధించింది. జోర్గెన్ గత రెండు శీతకాల ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచింది. 7.5 కిలోమీటర్ల స్ప్రింట్‌లో లారా దాల్మియర్ (జర్మనీ) పసిడి పతకం సాధించింది. పురుషుల 1500మీ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్‌లో లిమ్ హ్యో జున్ దక్షిణ కొరియాకు స్వర్ణం అందించాడు.
మహిళల 3000మీ స్పీడ్ స్కేటింగ్‌ను నెదర్లాండ్స్ క్లీన్‌స్వీప్ చేసింది. ఆ దేశానికి చెందిన అచ్‌తెరీక్తె స్వర్ణం నెగ్గగా.. ఇరీన్ వుస్ట్ రజతం, ఆంటోయిన్‌టె డి జోంగ్ కాంస్యం సాధించారు.
ఆ కొరియా జట్టుదే ఆకర్షణ: స్వర్ణాలెవరూ గెలిచినా శనివారం అందరినీ ఆకర్షించింది మాత్రం మహిళల ఐస్ హాకీలో సంయుక్త కొరియా జట్టే. ఐతే ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య తన తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన దక్షిణ-ఉత్తర కొరియా జట్టు 0-8తో స్విట్జర్లాండ్ చేతిలో ఓడిపోయింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.