ఐస్ స్కేటింగ్: ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన జగితోవా

హైదరాబాద్: దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్ వేదికగా జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్ తుది దశకు చేరుకున్నాయి. బుధవారం జరిగిన వింటర్ ఒలింపిక్స్ పోటీల్లో అలినా జగితోవా, స్కీయింగ్ బ్యూటీ లిండ్సే వోన్, వెటరన్ స్టార్ మారిట్ బోర్గెన్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ ముగ్గురిలో వింటర్ ఒలింపిక్స్‌లో తొలిసారి తలపడుతున్న 15 ఏళ్ల రష్యన్ క్రీడాకారిణి జగితోవా ఫిగర్ స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఫిగర్ స్కేటింగ్ టీమ్ ఈవెంట్ షార్ట్ ఈవెంట్లో జగితోవా రికార్డుస్థాయిలో 240 పాయింట్లు స్కోరుచేసి.. అంతకముందు తన దేశానికే చెందిన మద్వెదెవా చేసిన 238 పాయింట్ల ప్రపంచ రికార్డును అధిగమించింది.


ఫిగర్ స్కేటింగ్ టీమ్ ఈవెంట్ షార్ట్ ఈవెంట్లో జగితోవా ప్రపంచ రికార్డు
జగితోవా అత్యధిక స్కోరు నమోదు చేయడం వల్ల తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు ఫైనల్‌కు చేరింది. ఇక, తన చివరి ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సత్తా చాటుతుందనుకున్న 33 ఏళ్ల అమెరికా స్కీయర్ లిండ్సే వోన్ కాంస్యంతో వీడ్కోలు పలకింది. మహిళల స్కీయింగ్‌లో గత ఒలింపిక్స్ (2014 సోచి)లో లిండ్సే వోన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

14 పతకాలు గెలిచిన ప్లేయర్‌గా మారిట్ జోర్జెన్ చరిత్ర
ఇక, వింటర్ ఒలింపిక్స్‌లో చరిత్రలో అత్యధికంగా 14 పతకాలు గెలిచిన ప్లేయర్‌గా నార్వేకు చెందిన 37 ఏళ్ల మారిట్ జోర్జెన్ చరిత్ర సృష్టించింది. తాజా ఒలింపిక్స్‌లో ఆమె ఖాతాలో నాలుగో పతకం చేరింది. స్కీయింగ్‌లో జోర్జెన్ క్రాస్ కంట్రీ టీమ్ స్ప్రింట్ ఫ్రీ ఈవెంట్‌లో మైకెన్ కాస్పెర్సన్ ఫల్లాతో కలిసి కాంస్య పతకం నెగ్గింది.

ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన అథ్లెట్
తద్వారా 13 పతకాలతో నార్వే క్రీడాకారుడు ఒలె ఇనార్ జోర్న్‌డాలెన్ పేరిట ఉన్న రికార్డును మారిట్ జోర్జెన్ బద్దలు కొట్టింది. వింటర్ ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన అథ్లెట్‌గా నిలిచింది. అంతేకాదు ఏ ఒలింపిక్స్ (వింటర్, సమ్మర్)లోనైనా అత్యధిక పతకాలు గెలిచిన రెండో మహిళా అథ్లెట్‌గా 37 ఏళ్ల జోర్జెన్ అరుదైన ఘనత సాధించింది.

అత్యధిక పతకాలు గెలిచిన మహిళా అథ్లెట్‌గా లారిసా లాతినినా
అప్పటి సోవియెట్ (ఇప్పటి ఉక్రెయిన్) జిమ్నాస్ట్ దిగ్గజం లారిసా లాతినినా సమ్మర్ ఒలింపిక్స్‌లో అత్యధికంగా 18 పతకాలు సాధించింది. వింటర్ లేదా సమ్మర్ ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు గెలిచిన మహిళా అథ్లెట్ రికార్డు లారిసా లాతినినా పేరిట ఉంది. మరోవైపు సోఫియా గాజియా (ఇటలీ)కు స్వర్ణం, రాగన్‌హిల్డ్ మోవిన్‌కెల్ (నార్వే)కు రజతం దక్కాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications