Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింటర్ ఒలింపిక్స్‌లో.. రష్యాకు మళ్లీ దారులు మూసుకుపోయి..

Winter Olympics 2018: CAS upholds Russian ban

హైదరాబాద్: ఫిబ్రవరి 9 శుక్రవారం ఆరంభం కాబోతున్న వింటర్ ఒలింపిక్స్‌లో తాజాగా మరోసారి రష్యాపై నిషేదం జారీ అయింది. 2018 వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 47మంది రష్యన్ క్రీడాకారులు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో అప్పీలు చేసుకున్నారు. అయితే వీరి అప్పీళ్లు ఏవీ చెల్లవంటూ కోర్ట్ కొట్టిపడేసింది.

ఫిబ్రవరి 9న మొదలుకాబోయే వింటర్ ఒలింపిక్స్‌కు పాల్గొన వద్దంటూ ఒలింపిక్ కమిటీ డిసెంబరు నెలలోనే రష్యా దేశాన్ని నిషేదించింది. ఆ దేశం తరపున ఆడబోయే క్రీడాకారులు మాత్రం ఈ నిషేదాన్ని వ్యతిరేకిస్తూ 47 మంది క్రీడాకారులు క్రీడల సమన్వయ కోర్టు(సీఏఎస్)ను ఆశ్రయించారు. అయితే వారి అప్ఫీలును సీఏఎస్ కొట్టి పడేసింది.

28మంది రష్యన్ అథ్లెట్లపై డోపింగ్ ఆరోపణలు ఉండటంతో రష్యన్ దేశాన్ని ఒలింపిక్స్ నుంచి నిషేదిస్తున్నట్లు ఇంతకుముందే ఒలింపిక్ కమిటీ తెలిపింది. కానీ, దక్షిణకొరియాలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ కు క్రీడాకారులు వ్యక్తిగతంగా పాల్గొనడానికి ఏ అభ్యంతరం లేదంటూ పేర్కొంది.

ఒకరి తర్వాత ఒకరు ఈ డోపింగ్ వివాదంలో బయటపడుతుండటంతో రష్యా దేశాన్ని అనుమతించేది లేదంటూ కోర్టు ఆజ్ఞలు జారీ అయ్యాయి. దీంతో ఆరు సార్లు స్వర్ణ విజేత అయిన షార్ట్ ట్రాక్ స్పీడ్‌స్కేటర్ విక్టర్ అన్ రష్యా దేశం తరపున పాల్గొనే అవకాశం లేకుండాపోయింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, February 9, 2018, 10:54 [IST]
Other articles published on Feb 9, 2018
Read in English: CAS upholds Russian ban
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+