For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధోనీ సేనపై వెస్టిండీస్ విజయం

By Staff
Mahendrasingh Dhoni
లండన్‌: కీలకమైన సూపర్‌ ఎయిట్‌ దశలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమ్‌ ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. లార్డ్స్‌ లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌ లో భారత్‌ ను 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ ఓడించింది. 154 పరుగుల లక్ష్యాన్ని విండీస్‌ 3 వికెట్లు కోల్పోయి చేధించింది. బౌలింగ్‌ (4/38)లో మెరిసిన బ్రావో (66; 36 బంతుల్లో 4X4, 3X6) బ్యాటింగ్‌లోనూ రెచ్చిపోయాడు! సిమ్మన్స్‌ (44; 37 బంతుల్లో 5X4) రాణించాడు. అంతకుముందు యువరాజ్‌ (67; 43 బంతుల్లో 6X4, 2X6), యూసుఫ్‌ పఠాన్‌ (31 ; 23 బంతుల్లో 3X4, 1X6) మెరుపులు మెరిపించి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించారు. బ్రావోకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కు దిగిన భారత్‌ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఎడ్వర్డ్స్‌ బౌలింగ్‌లో పుల్‌ షాట్‌ కొట్టి వూపు మీద కనిపించిన రోహిత్‌ శర్మ (5) మళ్లీ భారీ షాట్‌ కొట్టబోయి టాప్‌ఎడ్జ్‌ కావడంతో సిమ్మన్స్‌కు దొరికిపోయాడు. కాసేపటికే రైనా (5) కూడా ఎడ్వర్డ్స్‌ బౌలింగ్‌లోనే వికెట్‌కీపర్‌ రామ్‌దిన్‌ పట్టిన చురుకైన క్యాచ్‌కు ఔటయ్యాడు. కాసేపటికే భారత్‌కు మరో షాక్‌! బ్రావో బౌలింగ్‌లో పుల్‌షాట్‌కు ప్రయత్నించిన గంభీర్‌ (14) సిమ్మన్స్‌ పట్టిన అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌కు ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 29/3.

ఒకవైపు వరస వికెట్లు పడుతున్నా సెహ్వాగ్‌ స్థానంలో వైస్‌ కెప్టెన్‌గా భాద్యతలు చేపట్టిన యువరాజ్‌సింగ్‌ తగ్గకుండా ఆడాడు. ఐతే బ్రావోతో పాటు బెన్‌, ఎడ్వర్డ్స్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో భారత రన్‌రేట్‌ బాగా పడిపోయింది. యువీ ధాటిగా ఆడటానికి ప్రయత్నించినా ధోనీ (11; 23 బంతుల్లో) మరీ నెమ్మదిగా ఆడాడు. ఈ స్థితిలో ధోనీ ఔటైనా యూసుఫ్‌తో కలిసి యువరాజ్‌ కళ్ళుచెదిరేలా ఆడాడు. 14వ ఓవర్‌ ఆఖరు బంతికి బెన్‌ బౌలింగ్‌లో యువీ సిక్స్‌ కొట్టాడు. తర్వాత వరసగా మూడు ఓవర్లలో యువీ-యూసుఫ్‌లు కలిసి 16, 12, 17 పరుగులు చేయడంతో భారత్‌ ఒక్కసారిగా పుంజుకుంది. ఐతే చివర్లో కీలక సమయాల్లో యూసుఫ్‌ ఔట్‌ కావడంతో భారత్‌ పరుగుల వేగం తగ్గింది. ఇన్నింగ్స్‌ చివరి మూడు బంతుల్ని భజ్జీ (13; 4 బంతుల్లో 3X4) ఫోర్లు కొట్టి భారత్‌ స్కోరు 150 పరుగులు దాటించాడు.

భారత ఇన్నింగ్స్‌: గంభీర్‌ (సి) సిమన్స్‌ (బి) బ్రావో 14; రోహిత్‌ శర్మ (సి) సిమన్స్‌ (బి) ఎడ్వర్డ్స్‌ 5; రైనా (సి) రామ్‌దిన్‌ (బి) ఎడ్వర్డ్స్‌ 5; యువరాజ్‌ (సి) అండ్‌ (బి) ఎడ్వర్డ్స్‌ 67; ధోని (సి) ఫ్లెచర్‌ (బి) బ్రావో 11; యూసుఫ్‌ పఠాన్‌ (బి) బ్రావో 31; ఇర్ఫాన్‌ పఠాన్‌ (సి) సిమన్స్‌ (బి) బ్రావో 2; హర్భజన్‌ నాటౌట్‌ 13; జహీర్‌ఖాన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 153 వికెట్ల పతనం: 1-12, 2-27, 3-29, 4-66, 5-130, 6-140, 7-141
బౌలింగ్‌: టేలర్‌ 4-0-44-0; ఎడ్వర్డ్స్‌ 4-0-24-3; బ్రావో 4-0-38-4; గేల్‌ 3-0-13-0; పొలార్డ్‌ 2-0-7-0; బెన్‌ 3-0-26-0

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: గేల్‌ (సి) జహీర్‌ఖాన్‌ (బి) యూసుఫ్‌ పఠాన్‌ 22; ఫ్లెచర్‌ (సి) యువరాజ్‌ (బి) ఇర్ఫాన్‌ పఠాన్‌ 0; సిమన్స్‌ (సి) ఇర్ఫాన్‌ పఠాన్‌ (బి) ఓజా 44; బ్రావో నాటౌట్‌ 66; చందర్‌పాల్‌ నాటౌట్‌ 18; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 156 వికెట్ల పతనం: 1-9, 2-42, 3-100
బౌలింగ్‌: జహీర్‌ఖాన్‌ 2.4-0-26-0; ఇర్ఫాన్‌ పఠాన్‌ 2-0-9-1; యూసుఫ్‌ పఠాన్‌ 4-0-27-1; హర్భజన్‌ 4-1-31-0; ఇషాంత్‌ శర్మ 3-0-31-0; ఓజా 3-0-29-1
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+