ఐఓఏ ముందు ఆత్మహత్య చేసుకుంటా: పారా అథ్లెట్ హెచ్చరింపు
హైదరాబాద్: ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో తనను ఎంపిక చేయకపోతే భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని పారా వెయిట్ లిఫ్టర్ సకీనా ఖాటున్ హెచ్చరించింది. ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్-2018కు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల జాబితాను ఐఓఏ ప్రకటించింది. ఈ జాబితాలో సకీనా ఖాటున్‌కు చోటు దక్కలేదు. దీంతో తాను తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఐఓఏ ప్రకటించే జాబితా కోసం వేచి చూస్తున్నాను
ఈ మేరకు ఓ జాతీయ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ 'భవిష్యత్తులో ఐఓఏ ప్రకటించే జాబితా కోసం వేచి చూస్తున్నాను. కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత జట్టులో నా స్థానం కోసం చివరి వరకు పోరాడుతాను. నా పేరు లేకపోతే కోర్టుకు వెళ్తాను. ఎందుకంటే వారు నా జీవితాన్ని నాశనం చేసినట్లే. ఏమాత్రం వెనుకాడను. ఐఓఏ ముందు ఆత్మహత్య చేసుకుంటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది.

లైట్‌వెయిట్ కేటగిరీలో కాంస్య పతకం
28 ఏళ్ల సకీనా ఖాటున్ గ్లాస్గో వేదికగా నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్ లైట్‌వెయిట్ కేటగిరీలో కాంస్య పతకం సాధించింది. ఇప్పటివరకు ఈ విభాగంలో పతకం సాధించిన ఏకైక పారా అథ్లెట్ కూడా సకీనానే కావడం విశేషం. ఈ ఏడాది కామన్వె్ల్త్ గేమ్స్ కోసం తాను నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.

ఎంతో కష్టపడ్డాను
'జాబితాలో నా పేరు లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు ఎంపిక చేయకపోవడంతో నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. చాలా ఒత్తడికి గురవుతున్నాను' అని సీడబ్ల్యూజీ, ఆసియా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న సకీనా ఆవేదనను వ్యక్తం చేసింది.

ఎంపిక చేయకపోడానికి ఐఓఏ చెప్పిన కారణం
ఈ విషయమై ఇప్పటికే భారత పారాలింపిక్ కమిటీకి సకీనా లేఖ రాసింది. అయితే కామన్వెల్త్ గేమ్స్ కమిటీ కొన్ని మార్పులు చేసిందని, అందుకే ఆమెను ఎంపిక చేయలేదని ఐఓఏ తెలపడం విశేషం. మరోవైపు భారత పారాలింపిక్ కమిటీ సకీనా లేఖకు స్పందించింది. కామెన్వెల్త్ గేమ్స్ కమిటీతో చర్చించి సకీనాను ఆడేలా చూడాలని ఐఓఏకు లేఖ రాసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications