For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా గేమ్స్: క్రీడాగ్రామంలో ఏర్పాట్లపై అథ్లెట్ల అసంతృప్తి

By Nageshwara Rao
Why Indian athletes are unhappy at Asian Games village in Palembang

జకార్తా: ఆసియా గేమ్స్‌లో అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన వసతి ఏర్పాట్లపై పలు దేశాలకు చెందిన అథ్లెట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అథ్లెట్ల కోసం నిర్మించిన గదులు చాలా చిన్నవిగా ఉన్నాయని, కాస్త విశాలంగా ఉంటే బాగుండేదని అంటున్నారు.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

ఇండోనేషియా వేదికగా 18వ ఆసియా గేమ్స్ అంగరంగ వైభవంగా శనివారం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 45 దేశాల నుంచి 10 వేల మందికి పైగా అథ్లెట్లు ఈ గేమ్స్‌లో పాల్గొనున్నారు. భారత్ నుంచి 572 మంది అథ్లెట్లు మొత్తం 36 క్రీడాంశాల్లో పోటీలకు సిద్ధమయ్యారు.

ఇందుకోసం ఇప్పటికే అన్ని దేశాలకు చెందిన ఆటగాళ్లు క్రీడా గ్రామానికి చేరుకున్నారు. క్రీడాకారుల కోసం ఇండోనేషియా సైతం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, వసతి ఏర్పాట్లపై పలువురు అథ్లెట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు మాట్లాడుతూ "గదులు చాలా చిన్నగా ఉన్నాయి. ఒక్కో గదిలో ముగ్గురు ఉండాలి. ఒక బాత్రూమ్‌ ఉంది. గదులు కాస్త విశాలంగా ఉంటే సౌకర్యవంతంగా బాగుండేది" అని తెలిపారు.

ఆసియా గేమ్స్ క్రీడాగ్రామంపై భారత్‌కు చెందిన ఓ అథ్లెట్ మాట్లాడుతూ "గదులు చాలా చిన్నగా ఉన్నాయి. ఇదొక్కటే సమస్య. ఫుడ్‌ విషయంలో ఎలాంటి సమస్యలు లేవు. మన దేశానికి సంబంధించిన వంటకాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. చికెన్‌, పప్పు, పన్నీర్‌తో పాటు పలు వంటకాలు ఉన్నాయిఠ" అని అన్నారు.

Story first published: Saturday, August 18, 2018, 17:52 [IST]
Other articles published on Aug 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+