డేవిస్ కప్ జట్టులో దక్కని చోటు: ఐటాపై బోపన్న విమర్శ
హైదరాబాద్: డేవిస్ కప్‌కు డిసెంబర్ 22న అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ప్రకటించిన జాబితాలో చోటు దక్కకపోవడంపై భారత టెన్నిస్ ఆటగాడు, ప్రపంచ డబుల్స్ 28వ ర్యాంకులో ఉన్న రోహన్ బోపన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న డేవిస్ కప్ జాతీయ జట్టులో బోపన్నకు చోటు దక్కని విషయం తెలిసిందే.
డేవిస్ కప్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా మహేశ్ భూపతి
ఐటా ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంపై బోపన్న తీవ్ర విమర్శలు చేశాడు. డేవిస్ కప్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటావా? అని డిసెంబర్ 8వ తేదీన సెలక్షన్ కమిటీ తనను సంప్రదించగా అందుబాటులో ఉంటానని సమాధానమిచ్చినట్లు బోపన్న పేర్కొన్నాడు. అయితే ఆ తర్వాత తాను ఎంపిక కాలేదని తెలిసి విచారం వ్యక్తం చేశాడు.

ఈమెయిల్ ద్వారా కూడా తనకు సమాచారం ఇవ్వలేదు
అయితే తన ఎంపికపై కనీసం ఈమెయిల్ ద్వారా కూడా తనకు సమాచారం ఇవ్వకపోవడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు డేవిస్ కప్‌కు తాను ఎంపిక అవకపోవడానికి ఐటా చెప్పిన సాంకేతిక కారణం తనను మరింత ఆశ్చర్యానిగి గురి చేసిందని చెప్పాడు.

డబుల్స్ ఆటగాళ్లలో మెరుగైన ర్యాంకులో ఉన్నాను
'మాస్టర్స్ సిరిస్ ఈవెంట్స్‌లో రెండు వైపులా (ఎడమ వైపు, కుడి వైపు) ఆడి నేను ఏటీపీ 250, 500 గెలిచాను. దేశంలోని డబుల్స్ ఆటగాళ్లలో మెరుగైన ర్యాంకులో ఉన్నాను. యాడ్ కోర్టు (ఎడమ వైపు)లో ఆడతానన్న సాంకేతిక కారణంతో నన్ను ఎంపిక చేయలేదని ఐటా చెప్పింది' ఇది ఎంతగానో బాధను కలిగించింది.

భారత్‌లో అందుకు విరుద్ధంగా జరుగుతోంది
'ఈ ఎంపిక ముందు సెలక్షన్ కమిటీ కాస్త కసరత్తు చేసి ఉండాల్సింది. ఏటీపీ టూర్ ఫైనల్స్-2012లో మహేశ్ భూపతితో కలిసి నేను డ్యూస్ కోర్టు (కుడి వైపు)లో ఆడాను. ప్రపంచ వ్యాప్తంగా ర్యాంకు ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తోంటే భారత్‌లో అందుకు విరుద్ధంగా జరుగుతోంది' బోపన్న తీవ్ర విమర్శ చేశాడు.

ర్యాంకింగ్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయలేదు.
సెలక్షన్ కమిటీలో మెంబర్‌గా ఉన్న జీషన్ అలీ దీనిపై మాట్లాడుతూ డేవిస్ కప్‌లో జాతీయ జట్టుని ర్యాంకింగ్ ఆధారంగా సెలక్టర్లు ఎంపిక చేయలేదని స్పష్టం చేశారు. కాగా, ఫిబ్రవరి 2017లో జరగనున్న డేవిస్ కప్‌కు సాకేత్ మైనేని, రామ్‌కుమార్ రామనాథన్, యుకీ బాంబ్రీ, లియాండర్ పేస్, ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్‌కు జట్టులో చోటు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications