For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

16 ఏళ్లకే షూటింగ్‌లో తొలి స్వర్ణం: ఎవరీ సౌరభ్ చౌధరి

By Nageshwara Rao
Who is Saurabh Chaudhary: 16-year-old farmers son from Meerut wins shooting gold on Asian Games debut

జకార్తా: ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో ఓ సాధారణ రైతు బిడ్డ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 16 ఏళ్లకే ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించి మేటి షూటర్లను విస్తుపోయేలా చేశాడు. ఆసియా గేమ్స్‌లో మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌లో షూటర్ సౌరభ్ చౌధరి స్వర్ణ పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

మీరట్‌కు చెందిన ఓ సాధారణ రైతు కొడుకు దిగ్గజ షూటర్లను సైతం వెనక్కినెట్టి అత్యధిక పాయింట్లతో ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. మీరట్‌కు సమీపంలోని పల్లెలో బాల్యం సాగించిన సౌరభ్, తీర్థాల్లో బెలూన్లు పేల్చడానికి ఇష్టపడేవాడు.

 సౌరభ్ ఆసియా గేమ్స్‌లో స్వర్ణం

సౌరభ్ ఆసియా గేమ్స్‌లో స్వర్ణం

అలా షూటింగ్‌పట్ల మక్కువ పెంచుకున్న సౌరభ్, ఇప్పుడు ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఒలింపిక్‌, వరల్డ్‌ చాంపియన్లను సైతం సౌరభ్ చౌధరి కంగుతినిపించాడు. నాలుగుసార్లు ఒలింపిక్‌, మూడుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ అయిన కొరియా షూటర్‌ జిన్‌ జోంగ్‌ (584)ను క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో వెనక్కునెట్టి సౌరభ్‌ (586) అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఫైనల్లో 42 ఏళ్ల జపాన్‌ షూటర్‌ టొమోయుకీ మట్సుడా, చౌధరి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. 22 షాట్లు ముగిసేసరికి మట్సుడా 220.5 పాయింట్లతో సౌరభ్‌ (220.1) కంటే స్వల్ప ఆధిక్యాన్ని కనబరిచాడు.

జూనియర్‌ వరల్డ్‌కప్‌లో ప్రపంచ రికార్డు

జూనియర్‌ వరల్డ్‌కప్‌లో ప్రపంచ రికార్డు

అయితే, 23వ షాట్‌లో తడబడిన మట్సుడా (239.7 పాయింట్లు) రజతంతో సరిపెట్టుకున్నాడు. సౌరభ్‌ చివరి రెండు షాట్లలో 10.2, 10.4 పాయింట్లు సాధించగా.. మట్సుడా 8.9, 10.3 మాత్రమే చేయగలిగాడు. ఇటీవల జర్మనీలో జరిగిన జూనియర్‌ వరల్డ్‌కప్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సౌరభ్‌.. తాను ఆడుతున్న తొలి ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకంతో భారత కీర్తిని మరింతగా ఇనుమడింప చేశాడు. ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన 29 ఏళ్ల అభిషేక్‌ వర్మ (219.3) కాంస్యం నెగ్గాడు.

సౌరభ్ స్వస్థలం యూపీలోని మీరట్‌ జిల్లా కలినా గ్రామం

సౌరభ్ స్వస్థలం యూపీలోని మీరట్‌ జిల్లా కలినా గ్రామం

ఇక, సౌరభ్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. స్వస్థలం యూపీలోని మీరట్‌ జిల్లా కలినా గ్రామం. తండ్రి రైతు కావడంతో చిన్నతనం నుంచే వ్యవసాయంపై ఆసక్తి. చదువుకుంటూనే పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఏదో వ్యాపకంగా తొలిసారి గన్ పట్టిన సౌరభ్ తీర్థాల్లో బెలూన్లు పేల్చడానికి ఇష్టపడేవాడు. ఆ తర్వాత మూడేళ్లు తిరిగే సరికి ఏస్‌ షూటర్‌గా పతకాలు కొల్లగొట్టాడు. ఈ క్రమంలో మీరట్‌కు 53 కిలోమీటర్ల దూరంలోని అమిత్‌ శరణ్‌ అకాడమీలో సౌరభ్‌ షూటింగ్‌లో మెళకువలు నేర్చుకున్నాడు. ప్రాక్టీస్‌ పెరిగేకొద్దీ కచ్చితత్వం రావడంతో ఆటపై అతడికి మరింత ఆసక్తి పెరిగింది.

జీతూ రాయ్‌, ఓం ప్రకాష్‌ మిథర్వాల్‌‌ను కంగు తినిపించిన సౌరభ్

జీతూ రాయ్‌, ఓం ప్రకాష్‌ మిథర్వాల్‌‌ను కంగు తినిపించిన సౌరభ్

జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో జీతూ రాయ్‌, ఓం ప్రకాష్‌ మిథర్వాల్‌ లాంటి ఏస్‌ షూటర్లనే కంగుతినిపించాడు. సెలెక్షన్‌ ట్రయల్స్‌లో మిథర్వాల్‌కు షాకిచ్చాడు. జూన్‌లో జరిగిన జూనియర్‌ వరల్డ్‌ కప్‌లో ప్రపంచ రికార్డు స్వర్ణంతో సౌరభ్‌ పేరు మార్మోగిపోయింది. ఆసియా గేమ్స్‌లో సైతం అదే ఫామ్‌ను కొనసాగించాడు. సీనియర్లు, ఆసియాడ్‌ పతక విజేతలతో కలసి ప్రాక్టీస్ చేయడం సౌరభ్‌కు ఎంతగానో కలసి వచ్చింది.

నాకు వ్యయసాయం అంటే ఎంతో ఇష్టం

నాకు వ్యయసాయం అంటే ఎంతో ఇష్టం

ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన అనంతరం సౌరభ్ మాట్లాడుతూ "నాకు వ్యయసాయం అంటే ఎంతో ఇష్టం. ఖాళీ సమయం దొరికితే ఇంటికి వెళ్లి పొలం పనుల్లో నాన్నకు సహకరిస్తాన'ని సౌరభ్‌ చెప్పాడు. శాకాహారి అయిన చౌధురి.. మితభాషి. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తాడు. గోల్డ్‌ మెడల్‌ షాట్‌ రౌండ్‌లోనూ తాను ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు" అని చెప్పాడు.

యూపీ ప్రభుత్వం రూ. 50 లక్షల నజరానా

యూపీ ప్రభుత్వం రూ. 50 లక్షల నజరానా

కాగా, ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన సౌరభ్‌ చౌధరిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్విటర్‌ వేదికగా సౌరభ్‌ను అభినందించారు. ఇక, సౌరభ్‌ సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అతనికి రూ. 50 లక్షల నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించింది.

Story first published: Wednesday, August 22, 2018, 11:47 [IST]
Other articles published on Aug 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+