For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మ కోసం 27 ఏళ్ల నుంచి వెతుకుతున్నా: అనీస్ దాస్

హైదరాబాద్: నెదర్లాండ్స్‌‌కు చెందిన ప్రముఖ స్కేటింగ్‌ క్రీడాకారిణి, 2018 ఒలింపిక్ పోటీదారు అయిన అనీస్‌ దాస్‌ తన కన్న తల్లి కోసం 27 సంవత్సరాలుగా అన్వేషిస్తుంది. తనకు ఐదేళ్ల వయస్సున్నప్పుడు తన కన్న తల్లి దండ్రులు వేరే ఉన్నారని తెలియడంతో అప్పటి నుంచి తన వెతుకులాట ప్రారంభించింది. అసలు కథ మొదలైంది ముంబైలోనే..

 ఎనిమిది నెలల వయసులోనే..:

ఎనిమిది నెలల వయసులోనే..:

32 ఏళ్ల అనీస్‌ దాస్‌ పుట్టింది ముంబయిలోనే. అనీస్‌తో పాటు ఆమె కవల సోదరికి ముంబైకి చెందిన దంపతులే జన్మనిచ్చారు. అనీస్‌, ఆమె సోదరికి 8 నెలల వయసుండగా నెదర్లాండ్స్‌కు చెందిన భార్యాభర్తలు దత్తత తీసుకున్నారు. అనీస్‌కు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో వీరికి సంబంధాలు తెగిపోయాయి. అనీస్‌కు, ఆమె సోదరికి కొంచెం ఊహ తెలిశాక, ఐదారేళ్ల వయసులో వారి దత్తత గురించి చెప్పారు.

 కొనసాగుతూనే ఉంది..:

కొనసాగుతూనే ఉంది..:

పెద్దయ్యాక ఈ విషయంపై స్పష్టత వచ్చింది. క్రీడాకారులైన వీళ్లిద్దరూ కెరీర్లపై దృష్టిపెట్టారు. పెరిగి పెద్దయ్యే కొద్దీ తమ తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలన్న పట్టుదల కలిగింది వీరికి. ఇప్పటికే డచ్‌ టీవీ ప్రోగ్రాం ద్వారా సందేశం పంపి తల్లిదండ్రుల గురించి తెలుసుకునే ప్రయత్నం మరింత తీవ్రతరం చేశారు. కానీ ఫలితం లేకపోయింది.

కెరీర్‌ను పక్కన పెట్టి:

కెరీర్‌ను పక్కన పెట్టి:

దీంతో ఇప్పుడు అనీస్‌ నేరుగా భారత్‌కే రావాలని నిర్ణయించుకుంది. ఇటీవలే స్కేటింగ్‌లో చక్కటి ప్రదర్శన ఇచ్చి వింటర్‌ ఒలింపిక్స్‌లో 500 మీ. రేస్‌కు అర్హత సాధించింది అనీస్‌. కొన్నాళ్ల పాటు తన కెరీర్‌ను సైతం పక్కన పెట్టి ఆమె త్వరలోనే ముంబైకి వచ్చి తమ తల్లిదండ్రుల కోసం వెతకాలని భావిస్తోంది.

 ఉన్న వారితో పాటు కన్నవారిని:

ఉన్న వారితో పాటు కన్నవారిని:

'నేనింత వరకు భారత్‌కు రాలేదు. కానీ ఈ దేశంతో నాకు బలమైన బంధం ఉంది. మా మూలాలు ఇక్కడే ఉన్నాయి. ముంబైలో మాకో కుటుంబం ఉంది. ఒలింపిక్‌ సీజన్‌ ముగియగానే ఇక్కడికి వస్తాం. మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం వెతుకుతాం. మమ్మల్ని పెంచి పెద్ద చేసిన వాళ్లు ఈ విషయంలో మాకెంతో అండగా ఉన్నారు. వారిని మేం పెంపుడు తల్లిదండ్రులుగా చూడట్లేదు' అని అనీస్‌ తెలిపింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 22, 2018, 13:06 [IST]
Other articles published on Jan 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+