తీరుమారని టీమిండియా చేవ తగ్గిందా..?

సెహ్వాగ్ (8), లక్ష్మణ్ (2), సచిన్ (23), రైనా (0), ఇషాంత్ శర్మ (1)లు మరోసారి ఘోర వైఫల్యం చెందారు. అయితే ద్రవిడ్ మాత్రం భారత ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. అర్ధ సెంచరీ సాధించిన ద్రవిడ్ (57) పరుగులతో నాటౌట్ నిలిచాడు. మరోవైపు కెప్టెన్ ధోనీ (5) పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్వాన్ మూడు, అండర్సన్, బ్రాడ్‌లు చెరో వికెట్ తీశారు.
అంతకుముందు 457/3 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌పై శ్రీశాంత్ ఎదురుదాడికి దిగాడు. శ్రీశాంత్ ధాటికి జేమ్స్ అండర్సన్ (13), మోర్గన్ (1) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో ఇంగ్లండ్ 487 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. అయితే మరోవైపు ఓవర్‌నైట్ స్కోరు 181తో బ్యాటింగ్ చేపట్టిన ఇయాన్ బెల్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇతనికి రవి బొపారా జతాకల్పాడు. వీరిద్దరూ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే కీలక ఇన్నింగ్స్ ఆడిన బెల్ 331 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్లతో 200 పరుగులను పూర్తి చేసుకున్నాడు.
భారత బౌలర్లపై విరుచుకు పడి పరుగుల దాహం తీర్చుకున్న బెల్ 235 పరుగుల వద్ద రైనా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే ఆ కొద్ది సేపటికి మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించడంతో 591 పరుగుల వద్ద మ్యాచ్‌ను నిలిపి వేయడం జరిగింది. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను అక్కడే డిక్లేర్డ్ చేశారు. బొపారా (44), ప్రియర్ (18) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో శ్రీశాంత్ మూడు, రైనా రెండు, ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications