రియో: ఓ వైపు 'సాక్షి' సంబరం, మరోవైపు వినేష్ విలవిల (పిక్చర్స్)
రియో డీ జెనిరో: రియో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల ఆశలు అడియాసలైన సమయంలో సాక్షి మాలిక్ రెజ్లింగ్‌లో కాంస్యం గెలిచింది. తద్వారా భారతీయుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఓ వైపు మనం సాక్షి గెలుపు అనుభూతి పొందుతుండగానే మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
రెజ్లింగ్‌లో పోటీ పడిన మరో మహిళ వినేష్ బలహీన ప్రత్యర్థి పైన ఆధిక్యం సంపాదించి, ఆ తర్వాత పోరాడలేక చతికిల పడింది. రెజ్లింగ్‌లో భారత్ తరఫున ముగ్గురు అర్హత సాధించారు. అందరిలో అందరి కంటే ఎక్కువ ఆశలు వినేష్ పైనే ఉన్నాయి.

వినేష్ ఆధిపత్యం
వినేష్ అంచనాలకు తగినట్లుగానే 48 కిలోల విభాగం ప్రీ క్వార్టర్సులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 11-0తో రొమేనియాకు చెందిన ఎమిలియా అలీనాను ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన సున్ యానన్‌తో ఆమె పోటీకి దిగింది.

వినేష్ కాలిని మెలి తిప్పిన చైనా ప్రత్యర్థి
పోటీ ప్రారంభం నుంచి చైనా రెజ్లర్ రక్షణాత్మకంగా ఆడింది. వినేశ్ ఆధిక్యంలో కనిపించింది. అయితే వినేశ్ కాలిని దొరకబుచ్చుకున్న చైనా రెజ్లర్ సున్ రెండు పాయింట్లు సాధించి 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అదే పట్టు కొనసాగించి, కాలిని అడ్డంగా మెలిపెట్టి తిప్పింది.

ముగిసిన వినేష్ పోరాటం
దీంతో వినేష్ పోరాటం ముగిసింది. అప్పటికే గాయమైన మోకాలిని ప్రత్యర్థి మెలిపెట్టి తిప్పేస్తుంటే తల్లడిల్లింది. కదలలేని స్థితిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

నొప్పితో కదల్లేక..
నొప్పితో విలవిల్లాడుతున్న ఆమెకు మ్యాట్‌పై ప్రథమ చికిత్స అందించారు. కాలు కదపలేని స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications