'ది గ్రేట్ ఖాలి': నాడు ఫీజు కట్టలేక బడికి దూరం, నేడు రెజ్లర్‌గా ప్రశంసలు
హైదరాబాద్: నిరుపేద కుటుంబంలో పుట్టి రెండున్నర రూపాయల ఫీజు కట్టలేక చదువు మానేసిన ప్రముఖ రెజ్లర్ దలీప్ సింగ్ రానాను 'ది గ్రేట్ ఖాలి' గా అభిమానులు ఆరాధిస్తుంటారు. రెజ్లింగ్‌లో పేరు ప్రఖ్యాతులు సాధించడం, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దలీప్ సింగ్ తన ఆత్మకథను 'ది మ్యాన్ హూ బికేమ్ ఖాలి' అనే పుస్తకం రాశారు.
వినిత్ కె.బన్సల్‌తో కలిసి దలీప్ సింగ్ రూపొందించిన ఈ పుస్తకంలో 1979లో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించాడు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురించింది. అందులో తాను రెండు రూపాయలు ఫీజు కట్టలేదని స్నేహితుల ముందు టీచర్ తిట్టిన విషయం నుంచి.. ఖాలిగా ఎలా మారాడన్న విషయం వరకు అన్నింటినీ ప్రస్తావించాడు.

ఉపాధ్యాయులు చెప్పేది తనకు అర్థమయ్యేది కాదు
రెండో తరగతి చదువుతున్న సమయంలోఉపాధ్యాయులు చెప్పేది తనకు అర్థమయ్యేది కాదని, అంతేకాకుండా, పాఠశాల ఫీజు తాను కట్టలేకపోవడంతో యాజమాన్యం తిట్టిపోసేదని, తోటి విద్యార్థులు తనను చూసి నవ్వుతుండేవారని పేర్కొన్నాడు. ఫీజు కట్టకపోవడంతో ప్రిన్సిపాల్ ఇబ్బంది పెడుతుండేవాడని, దాంతో చదువు మానేసి తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు.

ఎనిమిదేళ్ల వయసులోనే టీ తోటల్లో పనిలో చేరాడు
ఆ తర్వాత ఎనిమిదేళ్ల వయసులోనే టీ తోటల్లో పనిలో చేరి రోజుకు రూ. 5 సంపాదించడం మొదలుపెట్టాడు. ఓ సారి దలీప్ తండ్రి వద్దకు ఓ వ్యక్తి వచ్చి గ్రామంలో తోట పని ఉందని, రోజుకు రూ.5 వస్తాయని చెప్పాడట. అప్పట్లో చేతిలో రెండు రూపాయలు కూడా లేని సమయంలో రోజుకు ఐదు రూపాయలు వస్తాయంటే తనకు చాలా సంతోషం వేసిందని, కష్టపడి పని చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని చెప్పాడు.

తల్లిదండ్రులకు సాయపడ్డ దలీప్ సింగ్
అయితే, దలీప్ ది చిన్నవయసు కావడం, అంత బలం ఉండదని భావించి దలీప్‌కు పని ఇచ్చేందుకు ఆ వ్యక్తి ఒప్పుకోలేదట. ఎందుకంటే ఈ పని చేయాలంటే ఎంతో బలం కావాలి. కానీ అప్పటికి దలీప్ ఎనిమిదేళ్ల పిల్లాడు. దాంతో అతను ఆ వృత్తికి సరిపోడని టీ తోటల యజమాని భావించాడు. అయితే దలీప్ మాత్రం ఏదో విధంగా తల్లిదండ్రులకు సాయపడ్డాడు.

వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్‌షిప్
అంతేకాదు ఒకప్పటి తన ఆకారాన్ని చూసి ఎగతాళి చేసే వారని దానిని పాజిటివ్‌గా తీసుకుని రెజ్లింగ్‌లో పట్టు సాధించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డబ్ల్యూడబ్ల్యూఈకి ఎంపికయ్యానని పేర్కొన్నాడు. వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్‌షిప్‌ను సైతం కైవసం చేసుకున్నాడు. రల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకోవడంతో అన్ని భయాల నుంచి బయటపడ్డానని తన ఆత్మకథలో దలీప్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications