హైదరాబాద్: ఐపీఎల్ తరహాలో వెస్టిండీస్‌లో కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. మెరుపు ఫీల్డింగ్, కళ్లు చెదిరే షాట్లకి కలబోతగా మారిన సీపీఎల్ అక్కడి క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.
తాజాగా సీపీఎల్‌కు సంబంధించిన పోస్టు చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. నైట్ రైడర్స్‌కు చెందిన సైయిరీస్ వైడ్ లైన్‌పైకి వెళ్లి ఏబీ డివిలియర్స్ తరహాలో షాట్ కొట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జట్టు విజయానికి 22 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన దశలో, ఫాస్ట్ బౌలర్ బంతిని ఆఫ్ స్టంప్‌కి దూరంగా విసిరాడు.
ఈ బంతిని ముందుగానే అంచనా వేసిన బ్యాట్స్‌మన్ సైయిరీస్ వైడ్ లైన్‌కి దగ్గరగా వెళ్లిపోయి మోకాళ్లపై కూర్చున్నాడు. బంతి పూర్తిగా బౌన్స్ అయ్యేలోపే బ్యాట్‌తో డీప్ స్వ్కైర్‌లెగ్ దిశగా షాట్ కొట్టాడు. అంతే.. బంతి నేరుగా వెళ్లి స్టాండ్స్‌లో పడింది. ఐపీఎల్‌లో ఈ తరహా షాట్‌ని ఏబీ డివిలియర్స్ అభిమానులకి పరిచయం చేశాడు.
దీంతో అచ్చం డివిలియర్స్‌లాగా షాట్ కొట్టావ్ అంటూ.. అభిమానులు సోషల్ మీడియాలో బ్యాట్స్‌మెన్ సైయిరీస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.