ఏడ్చి.. కాంస్యం వద్దన్న బాక్సర్ సరితాదేవి (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్ ఓటమిని చవిచూసిన బాక్సర్ సరితా దేవి అక్కడి అధికారులకు షాక్ ఇచ్చింది. తనకు కాంస్య పతకాన్ని స్వీకరించేందుకు భారతీయ బాక్సర్ సరితాదేవి నిరాకరించింది. అంతేకాదు పోడియం ముందు కన్నీరు మున్నీరుగా విలపించింది. సెమీస్ లో రిఫరీలు తనకు అన్యాయం చేశారని నిరాశకు గురైన సరితాదేవి పతకం తీసుకునేందుకు నిరాకరించింది.
సెమీస్ లో రిఫరీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దక్షిణ కొరియా బాక్సర్ జినా పార్క్ గెలిచినట్లు ప్రకటించారని సరితాదేవి, ఆమె భర్త కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి బౌట్‌లో సరితాదేవి పూర్తి ఆధిక్యం కనబర్చినా జడ్జీలు జినా పార్క్ గెలిచినట్లు ప్రకటించారు. దీనిపై అప్పీల్ చేసినా పట్టించుకోలేదు.
కాంస్య పతకం తీసుకునేందుకు పోడియం వద్దకు పిలిచినప్పటి నుంచి సరితాదేవి ఏడుస్తూనే ఉంది. పతకం తీసుకోవడానికి కూడా నిరాకరించి దానిని రజత పతకం సాధించిన జినా పార్క్ కే ఇచ్చేసింది. దీంతో షాక్ కు గురైన జీనా పార్క ఏం చేయాలో తెలియక... పోడియం వద్ద ఉంచి ఆమె కూడా వెళ్లిపోయింది.
దీంతో ఆ కాంస్య పతకాన్ని ఆసియా గేమ్స్ నిర్వహకులు తమ వద్దే ఉంచుకున్నారు. ఒకటిన్నర సంవత్సరాల బాబును కుడా వదలిపెట్టి కఠోరమైన శిక్షణ తీసుకున్నానని, చివరకు తన కొడుకు కూడా ఒకదశలో తనన్ని గుర్తు పట్టలేకపోయాడని సరితా దేవి వాపోయింది.
దీని తర్వాత వచ్చే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు సరిదాదేవి చెప్పింది.

పతకం వద్దన్న బాక్సర్ సరితాదేవి
ఆసియా గేమ్స్ ఓటమిని చవిచూసిన బాక్సర్ సరితా దేవి అక్కడి అధికారులకు షాక్ ఇచ్చింది. తనకు కాంస్య పతకాన్ని స్వీకరించేందుకు భారతీయ బాక్సర్ సరితాదేవి నిరాకరించింది.

పతకం వద్దన్న బాక్సర్ సరితాదేవి
అంతేకాదు పోడియం ముందు కన్నీరు మున్నీరుగా విలపించింది. సెమీస్ లో రిఫరీలు తనకు అన్యాయం చేశారని నిరాశకు గురైన సరితాదేవి పతకం తీసుకునేందుకు నిరాకరించింది.

పతకం వద్దన్న బాక్సర్ సరితాదేవి
కాంస్య పతకం తీసుకునేందుకు పోడియం వద్దకు పిలిచినప్పటి నుంచి సరితాదేవి ఏడుస్తూనే ఉంది. పతకం తీసుకోవడానికి కూడా నిరాకరించి దానిని రజత పతకం సాధించిన జినా పార్క్ కే ఇచ్చేసింది.

పతకం వద్దన్న బాక్సర్ సరితాదేవి
దీంతో షాక్ కు గురైన జీనా పార్క ఏం చేయాలో తెలియక... పోడియం వద్ద ఉంచి ఆమె కూడా వెళ్లిపోయింది.

పతకం వద్దన్న బాక్సర్ సరితాదేవి
దీంతో ఆ కాంస్య పతకాన్ని ఆసియా గేమ్స్ నిర్వహకులు తమ వద్దే ఉంచుకున్నారు.

పతకం వద్దన్న బాక్సర్ సరితాదేవి
ఒకటిన్నర సంవత్సరాల బాబును కుడా వదలిపెట్టి కఠోరమైన శిక్షణ తీసుకున్నానని, చివరకు తన కొడుకు కూడా ఒకదశలో తనన్ని గుర్తు పట్టలేకపోయాడని సరితా దేవి వాపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications