WFI: భారత రెజ్లర్లకు గుడ్ న్యూస్. భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI)పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్‌కు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాధ్యత అప్పగించబడింది. కొత్త అధ్యక్షుడి కోసం జరిగిన ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కు నమ్మిన బంటు అయిన సంజయ్ సింగ్ గెలిచాడు. గతంలో మహిళా రెజ్లర్లను వేధించాడని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 25-30 వరకు జోర్డాన్‌లోని అమ్మాన్ లో జరగనున్న ఆసియా ఛాంపియన్ షిప్ కు ముందు ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఈ టోర్నమెంట్ లో భారత రెజ్లర్లు పాల్గొనకపోతే సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ లో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్ లలో పాల్గొనకుండా నిషేధించబడి ఉండేది.
నిషేధం ఎత్తివేశారు.. ఇప్పుడు ఏం జరుగుతుంది?
భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం ఎత్తివేస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయ టోర్నమెంట్ల నిర్వహణతో పాటు జాతీయ జట్ల ఎంపిక కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. భారతీయ అథ్లెట్ల ప్రయోజనాల దృష్ట్యా డిసెంబర్ 24, 2023 నాటి ఉత్తర్వు ద్వారా భారతీయ రెజ్లింగ్ సమాఖ్యపై విధించిన సెస్పెన్షన్ ను క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ఈ క్రమంలో భారత రెజ్లింగ్ సమాఖ్య నిధులను పొందుతుంది. అదే సమయంలో దాని సొంత నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు భారత రెజ్లింగ్ సమాఖ్య జాతీయ టోర్నమెంట్ ను కూడా నిర్వహించగలదు.

డిసెంబర్ 2023లో ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో అండర్-15, అండర్-20 జాతీయ ఛాంపియన్‌షిప్‌లను నిర్వహిస్తామని ప్రకటించడం.. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు సంజయ్ సింగ్ ప్రకటించిన తర్వాత భారత రెజ్లింగ్ సమాఖ్య సస్పెండ్ చేయబడింది. అంటే పాత కార్యవర్గం నియంత్రణలోనే భారత రెజ్లింగ్ సమాఖ ఉండడం లాంటి కారణాలతో భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ విధించబడింది. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా అనేక మంది రెజ్లర్ల నిరసనల మధ్య ఈ చర్య వచ్చింది. దీని తర్వాత భారత రెజ్లింగ్ సమాఖ్య రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి ముగ్గురు సభ్యుల తాత్కాలిక కమిటీని భారత ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసింది. తర్వాత ఈ కమిటీ రద్దు చేయబడింది. వినేష్ ఫోగట్ ప్రస్తుతం గర్భవతి కాగా.. బజరంగ్ పునియా కూడా క్రీడకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం బజరంగ్ పునియా ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు.
VIDEO | “I thank the Sports Minister on behalf of the coaches, and players. I was working for the wrestlers and the country so, I had the belief that the suspension will be revoked,” says WFI President Sanjay Singh.
— Press Trust of India (@PTI_News) March 11, 2025
STORY | Sports Ministry revokes WFI suspension, restores… pic.twitter.com/eWYbIb9UFf
క్రీడా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ.
భారత రెజ్లింగ్ సమాఖ్య సజావుగా పని చేయడానికి మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో సూచనలు ఇచ్చింది. సస్పెన్షన్ కాలం చేసిన సవరణలను భారత రెజ్లింగ్ సమాఖ్య ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయం భారత రెజ్లర్లకు ఉపశమనం కలిగించింది. వారు ఇప్పుడు అంతర్జాతీయ పోటీలలో పాల్గొనగలుగుతారు. అన్ని అంతర్జాతీయ ఈవెంట్లకు ఎంపిక స్వేచ్ఛగా, న్యాయంగా, పారదర్శకంగా జరిగేలా భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్ధారించుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.