న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓటమిపై హోల్డర్: న్యూజిలాండ్ గెలిచినా అందులో విండీస్ టాప్!

By Srinivas

వెల్లింగ్టన్: ప్రపంచ కప్‌లో భాగంగా శనివారం నాడు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ అస్థిరతతో మ్యాచ్ ఓడిందని, అందుకు తగ్గ ఫలితం అనుభవిచిందని ఆ జట్టు కెప్టెన్ హోల్డర్ అన్నాడు. ఆఖరు ఓవర్లలో తాము మరింత బాగా బౌలింగ్ చేయవలసి ఉండెనని చెప్పాడు. తాము యార్కర్లను సరిగ్గా వేయలేకపోయామన్నాడు. తాము గతంలో ఎన్నో మంచి గేములు, ఎన్నో చేదు మిగిల్చే మ్యాచ్‌లు ఆడామన్నాడు.

తాను ఆడిన ప్రతి షాట్‌కు తగిన ఫలితం దక్కిందని, 237 పరుగులు చేశానంటే నమ్మలేకపోతున్నానని ఈ మ్యాచ్ తనను మరో మెట్టు పైకి ఎక్కించిందని గుఫ్తిల్ మ్యాచ్ అనంతరం చెప్పాడు.

కివీస్ గెలిచినా వెస్టిండీస్‌వే ఎక్కువ సిక్స్‌లు

West Indies pay price for inconsistency, says Jason Holder

వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం జరిగిన వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 31 సిక్సర్లు నమోదయ్యాయి. ప్రపంచ కప్ చరిత్రలో ఇది రికార్డు. అంతకు ముందు, 2007లో విండీస్‌పై దక్షిణాఫ్రికా 19 సిక్సర్లు కొట్టింది. ఒక వన్డే మ్యాచ్‌లో ఎక్కువ సిక్సర్లు నమోదైన మ్యాచ్‌ల్లో ఇది సంయుక్తంగా రెండో స్థానాన్ని ఆక్రమించింది. కివీస్ కంటే విండీస్ 143 పరుగులు తక్కువ చేసనా. విండీస్ ఓ సిక్సర్ ఎక్కువ చేసింది. విండీస్ 16 సిక్స్‌లు, కివీస్ 15 సిక్స్‌లు కొట్టింది.

ప్రపంచ కప్‌లో అత్యధిక స్కోర్లు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో గుఫ్తిల్ అగ్రస్థానాన్ని ఆక్రమించగా, గేల్ రెండో స్థానానికి పడిపోయాడు. గారీ కిర్‌స్టెన్ (దక్షిణాఫ్రికా) 188 పరుగులు (నాటౌట్)తో మూడో స్థానంలో ఉన్నాడు. డబుల్ సెంచరీ చేసిన వాళ్లలో ఎక్కువ డాట్ బాల్స్ అడింది గుఫ్తిలే(65).

న్యూజిలాండ్ చేసిన 393 పరుగుల్లో 60.5 శాతం పరుగులు గప్టిల్ సాధించినవే కావడం గమనార్హం. వన్డే చరిత్రలో ఒక బ్యాట్స్‌మెన్ ఈ విధంగా తన జట్టు స్కోరులో 60 శాతం లేదా అంతకు మించి పరుగులు చేయడం ఇది పదోసారి. న్యూజిలాండ్ తరఫున ఈ ఫీట్ సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా గప్టిల్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఇంతకు ముందు ఆండ్రూ జోన్స్, స్కాట్ స్టయిరిస్ ఇదే విధంగా జట్టు స్కోరులో 60 శాతానికి పైగా పరుగులు చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X