Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెయిట్‌లిఫ్టర్‌ సీమాపై నాలుగేళ్ల నిషేధం!!

Weightlifter Seema receives four-year ban for doping

న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడిన భారత వెయిట్‌లిఫ్టర్‌, కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత సీమాపై సస్పెన్షన్‌ వేటు పడింది. నిషేదిత ఉత్ప్రేరకాలు వాడినందుకు గాను జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధించింది. 2017 కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో 75 కేజీల విభాగంలో రజత పతకం గెలిచిన సీమా, 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆరో స్థానంలో నిలిచింది.

ఈ ఏడాది విశాఖపట్నంలో జరిగిన 34వ జాతీయ మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ సందర్భంగా సీమా నుంచి నాడా అధికారులు శాంపిల్స్‌ సేకరించారు. వాటిని పరీక్ష చేయగా.. అందులో అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిషేధించిన ఉత్ప్రేరకాలు ఉన్నట్లు స్పష్టం అయింది. దీంతో 'నాడా'కు చెందిన డోపింగ్‌ నిరోధక క్రమశిక్షణా ప్యానెల్‌ సీమాపై వేటు వేసింది.

'సీమ నమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు స్పష్టమైంది. ఇది జాతీయ డోపింగ్‌ నిరోధక నిబంధనలకు విరుద్ధం కావడంతో ఆమెపై చర్యలు తీసుకున్నాం. నాలుగేళ్ల నిషేధం విధించాం' అని శనివారం నాడా ఒక ప్రకటనలో తెలిపింది.

వాడా నిషేధిత 2019 జాబితా ప్రకారం.. హైడ్రాక్సీ -4-మెథాక్సీ టెమోక్సిఫెన్ (మెటాబోలైట్ ఆఫ్ టామోక్సిఫెన్), సెలెక్టివ్ ఈస్ట్రోజెన్ రిసెప్టర్ మాడ్యులర్ మెటెనోలోన్, అనాబాలిక్ స్టెరాయిడ్ ఆస్టరైన్ (ఎనోబోస్రామ్), సెలెక్టివ్ ఆండ్రోజెన్ రిసెప్టర్ మాడ్యులర్ లాంటివి నిషేదిత ఉత్ప్రేరకాలు.

Story first published: Sunday, December 29, 2019, 9:24 [IST]
Other articles published on Dec 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+