న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డోపింగ్ నిబంధన ఉల్లంఘన: సర్బ్‌జీత్ కౌర్‌పై నాలుగేళ్ల నిషేధం

Weightlifter Sarbjeet Kaur banned for four years for doping violation

హైదరాబాద్: డోపీగా తేలిన భారత వెయిట్‌లిఫ్టర్ సర్బ్‌జీత్ కౌర్‌పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నాలుగు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. డోపింగ్ నిబంధన ఉల్లంఘించినందుకు గాను సర్బ్‌జీత్ కౌర్‌‌పై నాలుగేళ్ల నిషేధం విధించడంతో పాటు జరిమానా విధించామని నాడా ఒక ప్రకటనలో తెలిపింది.

గతేడాది ఫిబ్రవరిలో విశాఖపట్నం వేదికగా జరిగిన 34వ మహిళా సీనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 71 కిలోల విభాగంలో సర్బ్‌జీత్ కౌర్‌ పతకాన్ని గెలుచుకుంది. ఈ ఈవెంట్ ముగిసిన అనంతరం నాడా డోప్ కంట్రోల్ ఆఫీసర్ ఆమె డోప్ టెస్ట్ శాంపిల్‌ను సేకరించారు.

101 మీటర్ల సిక్స్‌ కొట్టిన అయ్యర్.. వావ్ అంటూ కోహ్లీ సర్‌ప్రైజ్!!101 మీటర్ల సిక్స్‌ కొట్టిన అయ్యర్.. వావ్ అంటూ కోహ్లీ సర్‌ప్రైజ్!!

వెయిట్‌లిఫ్టర్ సర్బ్‌జీత్ కౌర్‌ డోప్ శాంపిల్ విశ్లేషణలో నిషేధిత పదార్థాలైన డి-హైడ్రాక్సీ-ఎల్‌జిడి -4033 (ఎల్‌జిడి 4033 మెటాబోలైట్), సెలెక్టివ్ ఆండ్రోజెన్ రిసెప్టర్ మాడ్యులేషన్స్, ఆస్టారిన్ (ఎనోబోసార్మ్)లు ఉన్నట్లు తేలింది. దీంతో ఆమె నాలుగేళ్ల పాటు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు.

పృథ్వీ షాకు మరో ఎదురుదెబ్బ: న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లకు దూరంపృథ్వీ షాకు మరో ఎదురుదెబ్బ: న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లకు దూరం

అంతకుముందు డిసెంబర్ 2017లో కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతక విజేత, వెయిట్‌లిఫ్టర్ సీమా కూడా డోపింగ్‌కు పాల్పడినందుకు గాను ఆమెను నాడా నాలుగేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా, గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌ మహిళల 75 కిలోల పోటీలో సీమా ఆరో స్థానంలో నిలిచింది.

Story first published: Wednesday, January 8, 2020, 15:24 [IST]
Other articles published on Jan 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X