Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

13న కోనేరు హంపీ పెళ్లి: చంద్రబాబుకు శుభలేఖ

Wedding Bells for Koneru Humpy
హైదరాబాద్: ప్రముఖ చందరంగ క్రీడాకారిణి కోనేరు హంపి పెళ్లి కూతురు కాబోతోంది. ఎప్ట్రానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి రామకృష్ణ తనయుడు అన్వేష్‌తో ఈ నెల 13న జరగనుంది. పెద్దలు నిశ్చయించిన ఈ పెళ్లి విజయవాడలోని 'ఏ కన్వెన్షన్ సెంటర్'లో అంగరంగ వైభవంగా జరుగుతుంది.

ఈ నేపథ్యంలో హంపి తండ్రి కోనేరు అశోక్ సతీసమేతంగా హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును తమ కూతురు వివాహానికి ఆహ్వానించారు. పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అభివృద్ధి కోసం రెండు లక్షల రూపాయల విరాళాన్ని వారు సీఎంకు అందజేశారు.

చెస్ ప్రపంచ ర్యాంకింగ్‌లో కోనేరు హంపి మూడో స్థానంలో ఉంది. ఇటీవలే అన్వేష్‌తో కోనేరు హంపి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తర్వాత కూడా ఆమె చదరంగ పోటీల్లో పాల్గొంటుందని సమాచారం.

1987 మార్చి 31న ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో జన్మించిన కోనేరు హంపి భారతదేశపు ప్రముఖ చదరంగ క్రీడాకారిణి. 2007 అక్టోబర్ లో ఫైడ్ ఎలో రేటింగ్‌లో 2600 పాయింట్లను దాటి మహిళా చదరంగంలో జూడిత్ పోల్గర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో నిల్చింది. ఈ స్థానం సంపాదించిన భారతదేశపు తొలి చెస్ క్రీడాకారిణి హంపి.

మహిళా గ్రాండ్ మాస్టర్‌లలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతి పిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన రికార్డు సృష్టించింది. కేలవం 15 సంవత్సరాల 1 నెల, 27 రోజుల వయస్సులోనే ఈ స్థానానికి ఎదిగింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+