మీర్పూర్: బంగ్లాదేశ్‌తో జరగనున్న చివరి వన్డేలో గెలవడమే తమ ముందున్న సవాల్ అని భారత జట్టు స్పిన్నర్ ఆర్ అశ్విన్ చెప్పాడు. గత రెండు వన్డేల్లో తాము సమష్టిగా విఫలమయ్యామని ఆవేదన చేశారు. ఓటమి నుంచి తాము పాఠం నేర్చుకున్నామని చెప్పారు.
సిరీస్‌లో ఓడిపోవడం అవమానంగా భావించడం లేదన్నారు. బాగా ఆడిన బంగ్లాదేశ్ సిరీస్ గెలిచిందని చెప్పాడు. అది సమంజసమే అన్నాడు. తొలి రెండు వన్డేలలో 11 వికెట్లు తీసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ పైన కూడా అశ్విన్ స్పందించాడు.

అతడిని తాము కిడ్నాప్ చేయమని సరదాగా వ్యాఖ్యానించాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ మంచి బౌలర్ అని, అతడిని తాము గౌరవిస్తామని చెప్పాడు. వైట్ వైష్ తప్పించుకుంటామని చెప్పారు. బంగ్లాదేశ్‌కు ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసునని, వారు బాగా ఆడుతున్నారని, టాప్ టీంల పైన గెలుస్తున్నారన్నాడు.