Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: కోబీ బ్రయంట్ భావోద్వేగ పోస్టు!

 We are completely devastated: Vanessa Bryants heartfelt post after Kobe and Giannas death

హైదరాబాద్: తన భర్త, కుమార్తె మరణవార్తతో తమ కుటుంబం పూర్తిగా నాశనమైందని బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబీ బ్రయంట్ భార్య వెనెస్సా బ్రయంట్‌ భావోద్వేగానికి గురయ్యారు. వారు లేని లోటు ఎవరూ పూడ్చలేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషాదకర సమయంలో తమకు తోడుగా ఉన్న లక్షలాది మందికి ధన్యవాదాలు తెలిపారు.

అభిమానులు ముద్దుగా 'బ్లాక్‌ మాంబా' అని పిలుచుకునే బాస్కెట్‌ బాల్‌ లెజెండ్‌ కోబీ బ్రయంట్‌, కుమార్తె గియానా(13)తో సహా మరో ఏడుగురు ఆదివారం కాలిఫోర్నియా సమీపంలోని క్యాలాబసస్‌ వద్ద జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.

ఈ నేపథ్యంలో కోబీ మరణంపై అతడి భార్య వెనెస్సా గురువారం తన ఇనిస్టాగ్రామ్‌లో భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేసింది. "ఈ విషాదకర సమయంలో తమకు తోడుగా ఉన్న లక్షలాది మందికి ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మాపట్ల చేసిన ప్రార్థనలకు ధన్యవాదాలు. మాకు ఖచ్చితంగా అవి అవసరం. నేను ఎంతో ఆరాధించే నా భర్త అకస్మాత్తుగా కోల్పోవడం మా కుటుంబాన్ని అగాథంలోకి నెట్టివేసింది" అని అన్నారు.

"నా ప్రియమైన భర్త కోబీ, అద్భుతమైన తండ్రి... నా అందమైన, అద్భుతమైన, చిన్నారి గియానా- నా కూతురు, నటాలియా, బియాంక, కాప్రీల సోదరి.. వాళ్లిద్దరినీ కోల్పోవడంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కోబీ, గిగీ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాం. వాళ్లు ఎల్లప్పుడూ మాతోనే ఉన్నట్లుగా భావిస్తాం. నేను వాళ్లిద్దరినీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవాలి. వారి తలపై ప్రేమగా ముద్దు పెట్టాలి. ఈ ప్రమాదంలో నా భర్త, కూతురితో పాటు చనిపోయిన మిగతా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి ముంబా స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ తరఫున సహాయం అందజేస్తాం" అంటూ తన ఇనిస్టాగ్రామ్‌లో భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశారు.

కోబీ, వెనెస్సాలు 2001లో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు ఆడ పిల్లలు. నటాలియా (17 ఏళ్లు), గియానా (13 ఏళ్లు), బియాంకా (3 ఏళ్లు), క్యాప్రి (7 నెలలు) ఉన్నారు. మాంబా స్పోర్ట్స్‌ అకాడమీలో గియానాకు బాస్కెట్‌బాల్‌ మ్యాచ్‌ ఉండటంతో అందులో పాల్గొనడానికి కోబీ హెలికాప్టర్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Story first published: Thursday, January 30, 2020, 13:16 [IST]
Other articles published on Jan 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+