Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బారత స్పిన్నర్లు కంగారెత్తించారు, వార్మప్ మ్యాచులో ఆసిస్ ఓటమి

Indian Team
బెంగళూరు: భారత స్పిన్నర్లు మ్యాచును మలుపు తిప్పారు. భారత్ తన తొలి వార్మప్ మ్యాచులో ఆస్ట్రేలియాపై స్పిన్నర్ల మాయాజాలంతో విజయం సాధించింది. భారత్ ఘోరంగా ఓడిపోతుందనిపించింది. వాట్సన్‌ (33), పైన్‌ (37), పాంటింగ్‌ (57; 85 బంతుల్లో 4X4) చెలరేగుతుంటే తొలి వార్మప్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాకు అయిపోయిందని అనిపించింది. కానీ స్పిన్నర్లు కంగారూలను తిప్పేశారు. యువ స్పిన్నర్‌ చావ్లా (4/31) మ్యాజిక్‌కు భజ్జీ (3/15) అనుభవం.. యువీ (1/19), అశ్విన్‌ (1/47)ల సహకారం జతకలవడంతో ఆదివారం ఆసీస్‌పై భారత్‌ విజయం సాధించింది. మొదట 214 పరుగులకు ఆలౌటైన ధోనీ సేన. ఆసీస్‌ను 176 పరుగులకే కుప్పకూల్చి 38 పరుగుల విజయాన్నందుకుంది. వార్మపే అయినప్పటికీ మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

116/1.. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 21 ఓవర్లలో చేసిన స్కోరిది. క్రీజులో పైన్‌ (36), పాంటింగ్‌ (35). సాధించాల్సిన లక్ష్యం 29 ఓవర్లలో 99 పరుగులు. అప్పుడు ఆసీస్‌ విజయంపై ఎవరికీ అనుమానాలు లేవు. మరుసటి ఓవర్లోనే కంగారూల పతనానికి బీజం పడింది. నిలకడగా ఆడుతున్న పైన్‌.. యువీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మన్‌ వచ్చినట్లే పెవిలియన్‌ చేరారు. చావ్లా నాలుగు వికెట్లతో ఆసీస్‌ వెన్ను విరిచాడు. మైకెల్‌ క్లార్క్‌ (0)ను బౌల్డ్‌ చేసిన చావ్లా.. తర్వాత ఎవరినీ క్రీజులో కుదురుకోవ్వలేదు. ఫ్లయిటెడ్‌ లెగ్‌బ్రేక్‌లతో ముప్పుతిప్పలు పెట్టాడు. 29వ ఓవర్లో వరుస బంతుల్లో వైట్‌ (4), డేవిడ్‌ హసి (0)లను వెనక్కి పంపాడు. ఫెర్గూసన్‌ (8)ను చావ్లానే ఔట్‌ చేశాడు. కీలక సమయంలో భజ్జీ.. పాంటింగ్‌తో పాటు జాన్సన్‌ (15), క్రెజా (0)లను ఔట్‌ చేసి విజయాన్ని చేరువ చేశాడు. బ్రెట్‌లీని బౌల్డ్‌ చేసి అశ్విన్‌ లాంఛనం పూర్తిచేశాడు.

అంతకుముందు తిరుగులేదనుకున్న భారత బ్యాటింగ్‌ తుస్సుమనిపించింది. సెహ్వాగ్‌ (54; 56 బంతుల్లో 8X4, 1X6) మినహా అంతా తేలిపోయారు. పఠాన్‌, అశ్విన్‌, నెహ్రా పోరాడకుంటే భారత్‌కు ఘోర పరాభవం ఎదురయ్యేదే! భుజం గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమైన అతడు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్‌ చేయడం శుభపరిణామం. అతను స్పిన్‌లో స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు. క్రేజా బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదాడు. అతడి బౌలింగ్‌లోనే భారీ సిక్స్‌తో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత బంతిని కట్‌చేయబోయి బౌల్డయ్యాడు. సచిన్‌కు విశ్రాంతి లభించడంతో వీరూకు జోడీగా గంభీర్‌ ఓపెనింగ్‌కు వచ్చాడు. బ్రెట్‌లీ వేసిన తొలి ఓవర్లో గంభీర్‌ ఒక్క పరుగూ చేయలేదు. నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడనిపించింది. ఆ తర్వాతా అతడు ఆకట్టుకోలేదు. బొలింజర్‌ బౌలింగ్‌లో స్లిప్‌లోని వైట్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తర్వాత వచ్చిన కోహ్లి (21; 33 బంతుల్లో 3X4) మూడు చక్కని ఫోర్లతో అలరించాడు. భారీ స్కోరు చేసే అవకాశమున్నా.. అనవసరంగా ఔటయ్యాడు. హేస్టింగ్స్‌ బౌలింగ్‌లో హసికి సునాయాస క్యాచ్‌ ఇచ్చాడు. యువీ (1) ఇలా వచ్చాడు అలా వెళ్లాడు. నిలదొక్కుకుంటున్నట్లే కనిపించిన ధోనీ (11) హేస్టింగ్స్‌ బౌలింగ్‌లో బౌల్డవగా.. రైనా (12)ను బ్రెట్‌లీ ఔట్‌ చేశాడు. హర్భజన్‌ (4), చావ్లా (0) లను లీ వరుస ఓవర్లలో బౌల్డ్‌ చేశాడు. అప్పుడు భారత్‌ స్కోరు 138/8. 150 లోపే భారత కథ ముగుస్తుందనిపించింది. ఐతే యూసుఫ్‌ పఠాన్‌ (32; 38 బంతుల్లో 2X6), అశ్విన్‌ (25 నాటౌట్‌; 47 బంతుల్లో 2X4) కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో భారత్‌ పోరాడగలిగే స్కోరు చేయగలిగింది. యూసుఫ్‌ తొమ్మిదో వికెట్‌కు అశ్విన్‌తో కలిసి 49 పరుగులు సాధించగా.. అశ్విన్‌ పదో వికెట్‌కు నెహ్రా (19)తో కలిసి 27 పరుగులు చేశాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌: గంభీర్‌ (సి) కామెరూన్‌ వైట్‌ (బి) బొలింజర్‌ 6; సెహ్వాగ్‌ (బి) క్రెజా 54; కోహ్లి (సి) డేవిడ్‌ హసి (బి) హేస్టింగ్స్‌ 21; యువరాజ్‌ (సి) పైన్‌ (బి) జాన్సన్‌ 1; ధోనీ (బి) హేస్టింగ్స్‌ 11; రైనా (సి) పైన్‌ (బి) బ్రెట్‌ లీ 12; పఠాన్‌ (సి) క్రెజా (బి) డేవిడ్‌ హసి 32; హర్భజన్‌ (బి) బ్రెట్‌ లీ 4; చావ్లా (బి) బ్రెట్‌ లీ 0; అశ్విన్‌ నాటౌట్‌ 25; నెహ్రా (సి) క్రెజా (బి) డేవిడ్‌ హసి 19; ఎక్స్‌ట్రాలు 29 మొత్తం: (44.3 ఓవర్లలో ఆలౌట్‌) 214
వికెట్ల పతనం: 1-12, 2-54, 3-63, 4-101, 5-113, 6-132, 7-136, 8-138, 9-187
బౌలింగ్‌: బ్రెట్‌లీ 10-1-35-3; బొలింజర్‌ 6-0-29-1; జాన్సన్‌ 9-0-42-1; హేస్టింగ్స్‌ 6-0-24-2; క్రెజా 10-0-56-1; డేవిడ్‌హసి 3.3-0-25-2

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వాట్సన్‌ (సి) చావ్లా (బి) శ్రీశాంత్‌ 33; పైన్‌ (సి) మునాఫ్‌ (బి) యువరాజ్‌ 37; పాంటింగ్‌ (స్టంప్డ్‌) ధోనీ (బి) హర్భజన్‌ 57; మైకెల్‌ క్లార్క్‌ (బి) చావ్లా 0; వైట్‌ (సి) అశ్విన్‌ (బి) చావ్లా 4; డేవిడ్‌ హసి (స్టంప్డ్‌) ధోనీ (బి) చావ్లా 0; ఫెర్గూసన్‌ (సి) కోహ్లి (బి) చావ్లా 8; జాన్సన్‌ (స్టంప్డ్‌) ధోనీ (బి) హర్భజన్‌ 15; హేస్టింగ్స్‌ నాటౌట్‌ 1; క్రెజా (ఎల్బీ) (బి) హర్భజన్‌ 0; బ్రెట్‌ లీ (బి) అశ్విన్‌ 1; ఎక్స్‌ట్రాలు 20 మొత్తం: (37.5 ఓవర్లలో ఆలౌట్‌) 176; వికెట్ల పతనం: 1-51, 2-118, 3-120, 4-138, 5-138, 6-148, 7-166, 8-175, 9-175

బౌలింగ్‌: నెహ్రా 2-0-12-0; శ్రీశాంత్‌ 5-0-21-1; మునాఫ్‌ 2-0-22-0; అశ్విన్‌ 9.5-0-47-1; చావ్లా 9-0-31-4; యువరాజ్‌ 5-0-19-1; హర్భజన్‌ 5-0-15-3.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+