Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎవరు గెలిచినా రికార్డ్! పాక్ బౌలర్ల టార్గెట్ కోహ్లీ, కవ్వించే బంతులు కొట్టొద్దు

అడిలైడ్: భారత్, పాకిస్తాన్ జట్లు తలపడిన వన్డే మ్యాచ్‌ల్లో ఎవరిది పైచేయి? ప్రపంచ కప్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే, టీమిండియా తిరుగులేని స్థితిలో ఉంది. 1992, 1996, 1999, 2003, 2011 ప్రపంచ కప్ పోటీల్లో పాక్‌ను ఎదుర్కొన్న భారత్, అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయాలను నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో పాక్‌పై 5-0 ఆధిక్యాన్ని సంపాదించినా, మొత్తం వన్డే మ్యాచ్‌ల్లో భారత్ వెనుకంజలోనే ఉంది.

రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ 126 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 50 విజయాలు సాధిస్తే, పాకిస్తాన్ 72 మ్యాచ్‌ల్లో నెగ్గింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఆదివారం మ్యాచ్ జరిగే అడెలైడ్‌లో ఈరెండు జట్లు చివరిసారి 2000 జూన్ 25న తలపడ్డాయి.

ఆ మ్యాచ్‌లో భారత్ 48 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, చివరిసారి ఈరెండు జట్ల మధ్య గత ఏడాది మార్చి 2న ఢాకాలో జరిగింది. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. ప్రపంచ కప్ చరిత్రను పునరావృతం చేయాలని భారత్, గత పరాజయాలను పక్కకుపెట్టి, వన్డేల్లో చూపిన ఆధిపత్యాన్ని కొనసాగించాలని పాకిస్తాన్ పట్టుదలతో ఉన్నాయ.

Virat Kohli

కవ్వించ్ బంతులు కొట్టొద్దు: గవాస్కర్

పాకిస్తాన్ బౌలర్లు కవ్వించి వేసే బంతులను వెంటబడి కొట్టవద్దని భారత బ్యాట్స్‌మెన్‌కి గవాస్కర్ సూచించాడు. కోహ్లీ నిలకడగా ఆడితే మంచి స్కోర్ చేయవచ్చునని తెలిపాడు. ఔట్ స్వింగ్స్ బాల్స్‌ను అనవసరంగా ఆడవద్దని సూచించాడు.

పాక్ బౌలర్ల టార్గెట్ కోహ్లీ

అడిలైడ్ బ్యాటింగ్ పిచ్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బౌలర్లు విరాట్ కోహ్లీని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+