భారత్-బంగ్లాదేశ్ పోరులో ఆసక్తికరం: రెండు జట్లకు ఠాగూర్ గీతాలు
మెల్‌బోర్న్: ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం నాడు (మార్చి 19) భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ ఏలో బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. నాలుగో స్థానంలో నిలిచింది. గ్రూప్ బీలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ రెండు మెల్‌బోర్న్‌లో తలపడనున్నాయి.
అయితే, రెండు జట్లకు సంబంధించి ఓ ఆసక్తికర అంశం ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆయా దేశాల జాతీయ గీతాలను ఆలపిస్తారు. భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో.. ఈ దేశాల జాతీయ గీతాలను ఆలపిస్తారు. అయితే, ఈ రెండు జాతీయ గీతాలను రాసింది కూడా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కావడం గమనార్హం.

భారత్ జాతీయ గీతం జనగణమన కాగా, బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లా. కాగా, బంగ్లాదేశ్, భారత్ జట్లు ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు రెండుసార్లు తలపడ్డాయి. ఓసారి భారత్, మరోసారి బంగ్లాదేశ్ గెలిచింది. ఇప్పుడు మూడోసారి తలపడుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications