ఫిఫా కప్: 24 ఏళ్ల తర్వాత జర్మనీ గెలుపు (పిక్చర్స్)
రియో డి జనీరో: నెల రోజుల పాటు ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగిన సాకర్ ప్రపంచ కప్ పోటీల్లో జర్మనీ విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరీ సాగిన పోరులో అర్జెంటీనాను 1-0 స్కోరుతో ఓడించి జర్మనీ కప్‌ను ఎగురేసుకుపోయింది. ఇరు జట్లు 45 నిమిషాల పాటు గోల్ చేయలేకపోయాయి.
24 ఏళ్ల తర్వాత జర్మనీ ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. గతంలో 8 సార్లు ఫైనల్‌కు చేరుకుని నాలుగు సార్లు విజయం సాధించింది. 1990లో చివరిసారి జర్మనీ విజేతగా నిలించింది. ఇది రెండు జట్ల మధ్య మూడో ఫైనల్ మ్యాచ్. అర్జెంటీనా 1986లో విజయం సాధించింది.
ఆట ఆరంభం నుంచే ఇరు జట్లు విరుచుకుపడ్డాయి. బంతి ఎక్కువ శాతం జర్మనీ చేతుల్లో ఉన్నప్పటికీ గోల్ పోస్టులపై దాడుల్లో అర్జెంటీనా దూసుకెళ్లింది.

ప్రపంచకప్ ఫైనల్
ఎప్పుడూ దాడుల్లో మెస్సీ ముందుంటే ఆసారి హిగ్వైన్ జర్మనీ డిఫెన్స్‌కు వణుకు పుట్టించాడు.

ప్రపంచ కప్ ఫైనల్
మొదటి అర్థభాగంలో గోల్ చేసే సువర్ణావకాశాన్ని అర్జెంటీనా జారవిడుచుకుంది. జర్మనీని దెబ్బ కొట్టడంలో ఆ విధంగా విఫలమైంది.

ప్రపంచ కప్ ఫైనల్
11వ నిమిషంలో మెస్సీ నుంచి పాస్ అందుకున్న లుకాస్ బిగ్లియా బాక్స్ బయటి నుంచి కొట్టిన షాట్‌ను కీపర్ అడ్డుకున్నాడు.

ప్రపంచ కప్ ఫైనల్
29వ నిమిషంలో హిగ్వైన్ జర్మనీ గోల్ పోస్టులోకి బంతిని పంపించాడు. కానీ ఆఫ్‌సైడ్ కావడంతో ఆనందం అందిరాలేదు.

ప్రపంచ కప్ ఫైనల్
పస్టాఫ్ చివరలో జర్మనీ దాడుల ఉధృతిని పెంచినా గోల్ చేయలేకపోయింది. ఎట్టకేలకు అర్జెంటీనాపై జర్మనీ విజయాన్ని సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications