For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మండుతున్న కారులో డ్రైవర్: ఫార్ములావన్ యాక్సిడెంట్‌ను చూశారా? (వీడియో)

Watch: Nico Hulkenberg Trapped Upside Down In Blazing Renault For 3 Minutes After Horror Crash

హైదరాబాద్: అబుధాబి గ్రాండ్ ప్రిలో ఫార్ములా వన్ డ్రైవర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆదివారం జరిగిన రేసులో రెనాల్ట్ డ్రైవర్‌ నికో హల్కెన్‌బర్గ్ కారు అదుప తప్పి ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. దీంతో వెంటనే ఆ కారుకి మంటలు అంటుకున్నాయి. అయితే, రేసింగ్ సిబ్బంది అతన్ని కష్టమ్మీద బయటకు తీసుకొచ్చారు.

అయితే, ఈ ప్రమాదంలో నికో హల్కెన్‌బర్గ్‌కు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటం విశేషం. అబుధాబి గ్రాండ్ ప్రిలో భాగంగా రేసు మొదలైన కొద్ది సేపటికే, తొలి ల్యాప్‌లోనే వెనుక నుంచి రొమేన్ గ్రోస్‌జీన్ కారు ఢీకొట్టడంతో హల్కెన్‌బర్గ్ కారు అదుపు తప్పింది. దీంతో కారు పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న బారియర్స్‌కు ఢీకొని ఆగిపోయింది.

దీంతో కారు ఇంజిన్‌లో నుంచి మంటలు వచ్చాయి. ఈ సమయంలో "మంటలు వస్తున్నాయి.. నన్ను వెంటనే బయటకు తీసుకురండి" అంటూ తన టీమ్‌కు రేడియోలో హల్కెన్‌బర్గ్ చెప్పడం మనం చూడొచ్చు. వెంటనే రేసింగ్ సిబ్బంది తల్లకిందులుగా పడిపోయిన కారు నుంచి అతడిని బయటకు తీసుకొచ్చారు.

అయితే, ఈ ప్రమాదానికి కారణమైన గ్రోస్‌జీన్ రేసు తర్వాత హల్కెన్‌బర్గ్ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఫార్ములావన్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Monday, November 26, 2018, 14:40 [IST]
Other articles published on Nov 26, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+