డెహ్రాడూన్: భారత మాజీ డబ్ల్యుడబ్ల్యుఇ రెజ్లర్ ఖలీ తానంటే ఏమీటో మరోసారి నిరూపించుకున్నాడు. తనపై తీవ్రంగా దాడి చేసిన బ్రాడీ స్టీల్‌ను చిత్తుచేసి ప్రతీకారం తీర్చుకున్నాడు.
ఆదివారం డెహ్రాడూన్‌లో జరిగిన రెజ్లింగ్ మ్యాచులో ఖలీ వీరవిహారం చేశాడు. తలకు బ్యాండెడ్ కట్టుకొని రింగులోకి దిగిన ఖలీ.. కెనడా రెజ్లర్లపై భారీ పంచులు కురిపించాడు. ప్రధాన ప్రత్యర్థి అయిన బ్రాడీ స్టీల్‌ను చిత్తుగా ఓడించాడు. 'ది గ్రేట్ ఖలీ షో' పేరిట ఆదివారం జరిగిన ఈ మ్యాచు వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.
అంతకుముందు జరిగిన మ్యాచులో కెనడియన్ రెజ్లర్ బ్రాడీ స్టీల్.. ఖలీని తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. స్టీల్, అతని అనుచరులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో తలకు, చేతికి గాయాలైన ఖలీ.. ఐసీయూలో ఉండి చికిత్స పొందాడు. గాయాల నుంచి కోలుకుని ఆదివారం మళ్లీ రింగులోకి దిగిన ఖలీ.. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు.

తాను కోలుకొని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన వెంటనే స్టీల్ పనిపడతానని ఖలీ ప్రకటించాడు. ఆ మాటను నిలబెట్టుకున్నాడు. 'ది గ్రేట్ ఖలీ రిటర్న్' పేరుతో జరిగిన ఎంటర్‌టెయిన్‌మెంట్ షోలో అతను స్టీల్‌ను ఓడించాడు.
గతవారం ఖలీపై కెనడా రెజ్లర్లు దాడి చేసి దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు. 7.1 అడుగుల ఎత్తుతో బలిష్టంగా ఉండే ఖలీ అసలు పేరు దలీప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ అధికారి అయిన ఖలీ.. 2007లోనే హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించాడు.