రియో డీ జనిరో : రియో ఒలింపిక్స్‌లో బాలీవుడ్ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెక్సికో స్విమ్మర్లు 'ఐలా రె ఐలా' అనే పాటకు డాన్స్ చేసి హోరెత్తించారు.
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్, త్రిషా కృష్ణన్ నటించిన 'కట్టామీటా' సినిమాలోని 'ఐలా రె ఐలా' పాట సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ పాటనే తమ డ్యాన్స్‌కు థీమ్‌గా ఎంచుకున్నారు మెక్సికో స్విమ్మర్లు.
రియో ఒలింపిక్స్ క్రీడల్లో సింక్రనైజ్డ్ స్విమ్ ఈవెంట్‌లో స్విమ్మర్లు కరీమ్ అచాచ్, నూరియా డిస్‌డాడో ఈవెంట్‌లో 'ఐలా రె ఐలా' పాటకు డ్యాన్స్ చేస్తూ అద్భుత ప్రదర్శన చేశారు.
ప్రిలిమినరీ రౌండ్‌లో ఆ సాంగ్‌కు డాన్స్ చేసిన మెక్సికో స్విమ్మర్లు ఫైనల్‌కు అర్హత సాధించడం విశేషం. మరో విశేషమేంటంటే.. ఆ స్విమ్మర్లకు అక్షయ్ తన ట్వీట్‌తో శుభాకాంక్షలు కూడా తెలిపారు. వారి విన్యాసాలు సూపర్ అంటూ కితాబిచ్చారు. కాగా, సంగీత దర్శకుడు ప్రీతమ్ కూడా తన పాట రియోలో మారుమోగడంపై ఆనందం వ్యక్తం చేశారు.