For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బౌన్సర్ తగిలి మైదానంలో ఒరిగిన స్టీవ్‌స్మిత్(వీడియో)

వెల్లింగ్టన్: బౌన్సర్ బంతి తాజాగా మరోసారి మైదానంలో ఆందోళనకు గురిచేసింది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఫాస్ట్‌ బౌలర్‌ నేల్ వాగ్నర్‌ విసిరిన బౌన్సర్‌ బంతి ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ హెల్మెట్‌కు బలంగా తాకింది.

అప్పటికే బౌన్సర్‌ ప్రమాదాన్ని ఊహించి బంతిని విడిచిపెట్టే ప్రయత్నంలో కిందకి వంగిన స్మిత్‌ తలకు బంతి తగలడంతో క్షణాల్లో అలానే క్రీజులో ఒరిగిపోయాడు. అయితే మైదానంలోనే స్మిత్‌ను పరీక్షించిన వైద్యులు హెల్మెట్‌ రక్షణగా ఉండటం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్ధారించారు.

దీంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే తిరిగి బ్యాటింగ్‌ కొనసాగించిన స్మిత్‌ శతకం(138: 241 బంతుల్లో 17ఫోర్లు)తో ఆస్ట్రేలియాకు మంచి స్కోరు అందించాడు. బౌన్సర్‌ తగిలే సమయానికి స్మిత్‌ స్కోరు 157 బంతుల్లో 78 పరుగులు.

Wagner feared worst after hitting Steve Smith on helmet with bouncer

స్మిత్‌ అలా క్రీజులో కుప్పకూలిన క్షణాలపై బౌన్సర్‌ విసిరిన వాగ్నర్‌ మాట్లాడుతూ.. ఆ సమయంలో కొన్ని నిమిషాల పాటు మైదానంలో ప్రకంపనలు వచ్చినట్లు అనిపించిందన్నాడు. కొంత ఆందోళనకు గురైనట్లు తెలిపాడు.

కాగా, శనివారం ఆరంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 370 పరుగులకు ఆలౌటవగా.. ఆదివారం ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది.

దాదాపు ఏడాది క్రితం క్రికెట్‌ మైదానంలో బౌన్సర్‌ తగిలి మృతి చెందిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూస్‌ మైదానంలోనే కుప్పకూలి మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి బౌన్సర్ బంతి ఏ ఆటగాడిని తగిలినా ప్రతీసారీ మైదానంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+