Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హెచ్‌సిఎకు వివిఎస్: మహేశ్వరికి కెసిఆర్ రూ. 25 లక్షలు

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) సలహాదారుగా డాక్టర్ వివియస్ లక్ష్మణ్ నియమితులయ్యారు. వివియస్ లక్ష్మణ్‌ను సలహాదారునిగా నియమిస్తూ హెచ్‌సిఎ గురువారం తీర్మానం చేసింది. హెచ్‌సిఎ అబివృద్ధికి లక్ష్మణ్ అనుభవాన్ని వాడుకుంటామని హెచ్‌సిఎ తెలిపింది.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆ మధ్య లక్ష్మణ్ తప్పుకున్న విషయం తెలిసిందే. లక్ష్మణ్ స్టయిలిష్ బ్యాట్స్‌మన్‌గా పేరు సంపాదించుకున్నారు. హైదరాబాదుకు చెందిన మొహమ్మద్ అజరుద్దీన్ తర్వాత అంతటి ఖ్యాతి దక్కించుకున్న హైదరాబాద్ లక్ష్మణ్ మాత్రమే కావడం విశేషం

VVS as HCA advosor and Meswari presented cheque

ఇదిలావుంటే, 2002 ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన వెయిట్‌ లిఫ్టర్ మహేశ్వరికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. అదే విధంగా ఆమెకు ఇంటి స్థలంతో పాటు ఉద్యోగం కూడా ఇస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు.

యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సాధించిన సానియా మీర్జాకు ఆయన కోటి రూపాయల బహుమతిని అందజేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+