
హైదరాబాద్: ప్రపంచ ర్యాపిడ్ చెస్ పోటీల్లో ఆనంద్ నంబర్.1గా నిలిచిన సంగతి తెలిసిందే. గురువారం వరకు జరిగిన పోటీల్లో ఇంతకుముందు నంబర్ .1గా ఉన్న మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించిన రష్యా గ్రాండ్ మాస్టర్ వ్లాదిమిర్ ఫెదోసివ్‌ను ఆనంద్ చిత్తు చేశాడు. ఇంకే ముంది ఆనంద్‌కు తిరుగులేకుండా పోయింది. ఈ గేమ్‌తో అతనికి ప్రపంచ ఛాంపియన్ షిప్ సొంతమైనట్లే.
ఉత్కంఠభరితంగా సాగిన పోరాటంలో పదిహేను రౌండ్లు ముగిసేసరికి 10.5 పాయింట్లతో అతడు వ్లాదిమిర్ ఫెదోసివ్ (రష్యా), ఇయాన్ నెపోమ్నియాచి (రష్యా)లతో సమానంగా నిలిచాడు. టైబ్రేక్‌లో ఫెదోసివ్‌ను 2-0తో ఓడించి టైటిల్ ఒడిసిపట్టాడు. 48 ఏళ్ల ఆనంద్ 14 ఏళ్ల తర్వాత ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ దక్కించుకున్నాడు.
శుక్రవారం ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్న ఆనంద్ సాధారణ స్థాయిలోనే ఫలితాలను అందుకొన్నాడు. తొలి 11 గేముల్లో 4 విజయాలను ఆరు డ్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. మిగిలిన ఆ ఒక్క గేమ్ 11వ రౌండ్లో ఇయాన్ నెపోమ్నియాచి (రష్యా) చేతిలో ఓడిపోయాడు.
కార్ల్‌సన్ (నార్వే)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను 65 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. దీంతో ఆనంద్ 7 పాయింట్లతో ఉమ్మడిగా హరికృష్గతో పాటు ఐదో స్థానంలో ఉన్నాడు. కర్జాకిన్ (రష్యా) 9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టోర్నీలో మరో 11 గేమ్‌లు మిగిలి ఉన్నాయి. ద్రోణవల్లి హారిక మహిళల విభాగంలో 11 రౌండ్లు ముగిసే సరికి 42వ స్థానంలో ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.